Mahindra XEV 9S: మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ 7 సీటర్ SUV XEV 9Sను గత నవంబర్‌లో భారత మార్కెట్లో విడుదల చేసింది. తాజాగా లాంచ్ అయిన XUV 7XOకి ఎలక్ట్రిక్ వెర్షన్‌గా వచ్చిన ఈ SUV ధరలు రూ.19.95 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతున్నాయి. భారతదేశంలో పూర్తిగా ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన తొలి 7-సీటర్ SUVగా XEV 9S నిలుస్తోంది. ఈ మోడల్‌ను మహీంద్రా యొక్క ఆధునిక INGLO ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్‌పై అభివృద్ధి చేశారు. SUVను కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ఆవిష్కరించగా, ఈ రోజు (జనవరి 14) బుకింగ్స్ ప్రారంభం కానుండగా, జనవరి 23 నుంచి డెలివరీలు మొదలవుతాయని కంపెనీ ప్రకటించింది.
Read Also: Anaganaga Oka Raju : పది షోలు మాత్రమే ఇస్తామన్నారు – నవీన్ పోలిశెట్టి
మూడు బ్యాటరీ ఆప్షన్లు..
* 59 kWh బ్యాటరీ – 170 kW పీక్ పవర్
* 70 kWh బ్యాటరీ – 180 kW పీక్ పవర్
* 79 kWh బ్యాటరీ – 210 kW పీక్ పవర్.. ఈ బ్యాటరీ ఆప్షన్లు నగర ప్రయాణాలతో పాటు దూర ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటాయని మహీంద్రా పేర్కొంది.
ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ డిజైన్
XEV 9S ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాలకు తగిన ఆధునిక డిజైన్‌తో వస్తోంది. బ్లాంక్ చేసిన గ్రిల్, L-షేప్ LED DRLs, వర్టికల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ముందు భాగం అంతటా విస్తరించిన LED లైట్ బార్ దీన్ని ఆకర్షణీయంగా మారుస్తుంది. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఏరో స్టైల్ అలాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, ముందు–వెనుక భాగాల్లో మహీంద్రా ఎలక్ట్రిక్ లోగోలు ఈ SUVకి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.
Read Also: Team India Playing XI: ఆయుష్ అరంగేట్రం.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
బెస్ట్ క్యాబిన్ స్పేస్
* ముందు, రెండో వరుస సీట్లలో కలిపి 4,076 లీటర్ల స్పేస్
* 527 లీటర్ల బూట్ స్పేస్
* క్లాస్‌లోనే బెస్ట్ 150 లీటర్ల ఫ్రంక్ (ఫ్రంట్ ట్రంక్)
* మూడో వరుసలో 50:50 స్ప్లిట్ సీట్లు ఉండటంతో ఫ్యామిలీ అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు. లగ్జరీ రియర్ సీట్ అనుభవం రెండో వరుస ప్రయాణికుల కోసం XEV 9S ప్రత్యేక లగ్జరీ ఫీచర్లను అందిస్తోంది.
పవర్డ్ బాస్ మోడ్
* వెంటిలేటెడ్ సీట్లు, రిక్లైన్ & స్లైడింగ్ ఫంక్షన్
* ప్రత్యేక సన్‌షేడ్స్
* అకూస్టిక్ లామినేటెడ్ గ్లాస్
* వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్
* LiveYourMood ఇంటర్ఫేస్తో మూడు అంబియంట్ మోడ్స్
* BYOD (Bring Your Own Device) సపోర్ట్
* లౌంజ్ డెస్క్, ట్రాన్స్లూసెంట్ డోర్ ఇన్సర్ట్స్
టెక్నాలజీ & ఎంటర్టైన్మెంట్
* 16-స్పీకర్ హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్ (Dolby Atmos సపోర్ట్‌తో)
* మూడు పెద్ద 31.24 సెం.మీ స్క్రీన్స్
* 5G కనెక్టివిటీ
* అంబియంట్ లైటింగ్
* స్మార్ట్ క్లైమేట్ కంట్రోల్ & క్యాంప్ మోడ్
* ఎంటర్టైన్మెంట్, వర్క్ యాప్స్ సపోర్ట్
భద్రతలోనూ అగ్రస్థానం
* 7 ఎయిర్‌బ్యాగ్స్
* లెవల్ 2+ ADAS (5 రాడార్లు + విజన్ కెమెరా)
* డ్రైవర్ డ్రౌజినెస్ డిటెక్షన్ (DOMS – Eyedentity)
* Secure360 Pro – లైవ్ వ్యూ, రికార్డింగ్, లైవ్ కమ్యూనికేషన్ ఫీచర్
మహీంద్రా XEV 9S ధరల జాబితా (ఎక్స్-షోరూమ్)
వేరియంట్ బ్యాటరీ ప్యాక్ ధర
ప్యాక్ వన్ అబోవ్- 59 kWh రూ.19.95 లక్షలు
ప్యాక్ వన్ అబోవ్- 79 kWh రూ.21.95 లక్షలు
ప్యాక్ వన్ అబోవ్- 70 kWh రూ.24.45 లక్షలు
ప్యాక్ టూ అబోవ్- 79 kWh రూ.25.45 లక్షలు
ప్యాక్ త్రీ- 79 kWh రూ.27.35 లక్షలు
ప్యాక్ త్రీ అబోవ్- 79 kWh రూ.29.45 లక్షలు