కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
- మహీంద్రా కొత్త పికప్ ట్రక్కు స్కార్పియో లైఫ్ స్టైలర్ అనే పేరు..
- భారత్‌లో ఏప్రిల్ 2027లో విడుదల
- ప్రారంభ ధర రూ.19.79 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే తక్కువగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra Scorpio Lifestyler: మహీంద్రా అండ్ మహీంద్రా భారత మార్కెట్ కోసం కొత్త పికప్ ట్రక్‌ను వెల్లడించింది. దీనికి మహీంద్రా స్కార్పియో లైఫ్ స్టైలర్ (Mahindra Scorpio Lifestyler) అనే పేరు పెట్టారు. అయితే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో ఈ పికప్ ట్రక్‌ను కేవలం “లైఫ్ స్టైలర్” పేరుతో అమ్మకాలు జరపనున్నారు. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కొత్త పికప్ ట్రక్ ఏప్రిల్ 2027 భారత్‌లో లాంచ్ కానుంది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర రూ.19.79 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే తక్కువగా ఉంటుందని మహీంద్రా వెల్లడించింది. అయితే టాప్-స్పెక్ వేరియంట్ ధరపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
డిజైన్:
దీనికి అమెరికన్ పికప్ ట్రక్కులను పోలిన పొడవైన, నిటారుగా ఉండే స్టాన్స్‌ను అందించారు. ముందు భాగంలో పెద్ద గ్లోస్ బ్లాక్ గ్రిల్ ఉండగా, దానిపై మహీంద్రా ట్విన్ పీక్స్ లోగో ఉంటుంది. గ్రిల్‌కు ఇరువైపులా ఎత్తుగా అమర్చిన హెడ్‌ల్యాంప్స్, వాటిలోనే DRLs ఉన్నాయి. ముందు భాగంలో నిలువుగా అమర్చిన ఫాగ్ ల్యాంప్స్ కోసం దీర్ఘచతురస్రాకార హౌసింగ్‌ను అందించారు. వీటితో పాటు బుల్బార్ తరహా డిజైన్‌తో కూడిన రగ్గడ్ బంపర్ పికప్ ట్రక్కు మరింత అగ్రెసివ్ లుక్‌ను అందిస్తుంది.
Also Read
- Royal Enfield Continental GT 650: రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 రిలీజ్.. USB Type-C ఫాస్ట్ ఛార్జింగ్ కూడా!
- Ampere Magnus G Max: 30కి పైగా కొత్త ఫీచర్లతో అప్డేట్ అయిన Ampere Magnus G Max.. 142km రేంజ్, ధర ఎంతంటే?
- Upcoming Royal Enfield Bikes 2026: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 3 కొత్త బైక్స్.. హిమాలయన్ 440, 750, GT 750 వచ్చేస్తున్నాయ్!
- JCB Hydrogen Car: బుల్డోజర్ల తయారీ సంస్థ JCB వరల్డ్ రికార్డు.. హైడ్రోజన్ కారుతో గంటకు 653.90KM స్పీడ్!
సైడ్ ప్రొఫైల్‌లో స్కార్పియో లైఫ్ స్టైలర్ డబుల్-క్యాబ్ లేఅవుట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 18-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, 255/65 R18 టైర్లు, చంకీ సైడ్ క్లాడింగ్, రూఫ్ రైల్స్ ఉన్నాయి. అలాగే కింక్డ్ బెల్ట్‌లైన్ దీని సైడ్ డిజైన్‌కు ప్రత్యేకమైన లుక్‌ను అందిస్తుంది. వెనుక భాగంలో C-ఆకారపు DRLsతో కూడిన వర్టికల్ LED టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. టెయిల్‌గేట్‌పై పెద్ద ‘మహీంద్రా’ వర్డ్‌మార్క్‌ను ఎంబాస్ చేశారు. ముందు భాగాన్ని పోలిన రగ్గడ్ డిజైన్‌తో వెనుక బంపర్‌ను రూపొందించారు.
ఇంటీరియర్, ఫీచర్లు:
ఇంటీరియర్ విషయంలో మహీంద్రా ప్రీమియం అనుభూతిని అందించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. డ్యాష్‌బోర్డ్ మధ్యలో పోర్ట్రెయిట్-స్టైల్ ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. దీనికి ఇరువైపులా AC వెంట్స్, దిగువన క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, ఫిజికల్ బటన్స్‌ను అందించారు. డ్రైవర్ కోసం కొత్త డిజైన్‌తో కూడిన స్టీరింగ్ వీల్‌తో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. అయితే పూర్తి ఫీచర్ల జాబితాను మహీంద్రా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఇప్పటికే స్కార్పియో Nలో ఉపయోగిస్తున్న ఇంజిన్లను కొనసాగించే అవకాశం ఉంది. ఇందులో 175 Hp పవర్ అందించే 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్, అలాగే 203 Hp పవర్ ఉత్పత్తి చేసే 2.0-లీటర్ డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండవచ్చని అంచనా. ట్రాన్స్మిషన్ ఎంపికలు కూడా Scorpio N తరహాలోనే ఉండే అవకాశం ఉంది. అంటే 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు అందుబాటులోకి రావచ్చు. ఆల్-టెర్రైన్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 4WD ఆప్షన్ కూడా లభించే అవకాశం ఉంది.
Meet the Mahindra Scorpio Lifestyler.
Inspired by freedom and exploration, this pick up from the house of Mahindra is designed for those who are constantly drawn to the outdoors and new vistas.
Priced under ₹19.79 Lakh*. Launches in April 2027.#ScorpioLifestyler… pic.twitter.com/iqu6ZeWPCN
— Mahindra Automotive (@Mahindra_Auto) August 14, 2026
తాజావార్తలు
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Red Fort: ఎర్రకోట ఎందుకు అంత ముఖ్యమైంది? మొఘలుల నుంచి బ్రిటిష్ వరకు.. చరిత్రలోని ఆసక్తికర నిజాలు
-
TV Ad Cap: 12 నిమిషాల యాడ్ రూల్‌కు కేంద్రం గుడ్‌బై.. టీవీ ఛానళ్లకు కొత్త నిబంధనలు
-
PM Modi: “మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు”.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
-
Sreeleela: ముంబైలో సెట్స్‌పై శ్రీలీల.. కార్తీక్ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్!
ట్రెండింగ్
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..