Mahindra Scorpio Classic: మహీంద్రా స్కార్పియో భారతీయ కస్టమర్లలో బాగా ప్రాచుర్యం పొందింది. గత కొన్ని సంవత్సరాలుగా స్కార్పియో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా మారుతోంది. మీరు కూడా ఈ నంబర్ -1 ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం! నిజానికి.. జీఎస్టీ సంస్కరణలు 2.0 తర్వాత.. కంపెనీ మహీంద్రా స్కార్పియో ధరలను రూ. ₹1.01 లక్షలకు తగ్గించింది. దీనితో పాటు.. ఈ ఎస్‌యూవీపై వేలది రూపాయల విలువైన ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే దాదాపు ఈ కారు రూ. 2,00,000 చౌకగా మారుతుంది?
మొదటి జీఎస్టీ సంస్కరణల అనంతరం మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ధర ₹1.01 లక్షల వరకు తగ్గింది. అదనంగా, కస్టమర్లకు ₹95,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలు అందిస్తున్నారు. అంటే ప్రస్తుతం వినియోగదారులు మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌పై ₹1.96 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. తగ్గింపు అనంతరం మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు ₹12.38 లక్షలకు చేరుకుంది. సమీప షోరూంలకు వెళ్లి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను వెంటనే పరిశీలించండి.
READ MORE: US Afghanistan Tensions: ట్రంప్ ఎఫెక్ట్.. తాలిబన్ సుప్రీం లీడర్‌కు హైసెక్యూరిటీ..!
కాగా.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్.. సిగ్నేచర్ టవరింగ్ బానెట్, కొత్త డ్యూయల్-టోన్ బంపర్లు, LED DRLలు, కొత్త గ్రిల్, రిఫ్రెష్డ్ అల్లాయ్ వీల్స్ వంటి కొత్త ఫీచర్లతో వస్తోంది. కారు లోపల 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్, యూఎస్‌బీ కనెక్టివిటీ, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ను కలిగి ఉంది. ఎత్తైన సీట్లు, విశాలమైన క్యాబిన్ కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మహీంద్రా స్కార్పియో క్లాసిక్ లో 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 130 bhp, 300 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీన్ని 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. భద్రతా విషయానికి వస్తే.. డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, EBDతో ABS, వెనుక పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ అలర్ట్, సీట్‌బెల్ట్ రిమైండర్ ఉన్నాయి.
నోట్ : కంపెనీ, వివిధ వెబ్‌సైట్లు అందించిన సమాచారం ప్రకారం… ఈ వార్త ప్రచురించాం. మీ మీ ప్రాంతాలను బట్టి రేట్లు మారొచ్చు. మరిన్ని వివరాలకు మీ డీలర్ లేదా దగ్గర షోరూంలను సంప్రదించండి..