Mahindra BE 6E: మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్ “BE 6E”పై ఇండిగో కేసు.. వివాదం ఏంటంటే..?
- మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్ "BE 6E"పై ఇండిగో కేసు..
- మహీంద్రా, ఇండిగో మధ్య ట్రేడ్‌మార్క్ ఇష్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra BE 6E: స్వదేశీ ఆటోమేకర్ మహీంద్రా ఇటీవల తన ప్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కార్లు BE 6E, XEC 9E కార్లను రిలీజ్ చేసింది. అత్యాధునిక ఫీచర్లు, స్టన్నింగ్స్ లుక్స్‌తో వినియోగదారులను వెంటనే ఆకర్షించేలా మహీంద్రా ఈ కార్లను డిజైన్ చేసింది. ఇదంతా బాగానే ఉన్నా, ప్రస్తుతం మహీంద్రా BE 6Eపై భారతదేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
BE 6E కారులో ‘‘6E’’ని ఉపయోగించడంపై ఇండిగో ఈ కేసు ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. దీనిని వాడటంపై ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ వర్సెస్ మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ పేరుతో ఈ కేసును మంగళవారం జస్టిస్ అమిత్ బన్సాల్ ముందుకు వచ్చింది. అయితే, ఈ కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకున్నారు. తదుపరి విచారణ డిసెంబర్ 09న జరగనుంది. అయితే, ఈ సమస్యను పరిష్కరించడానికి మహీంద్రా, ఇండిగోతో చర్చలు ప్రారంభించినట్లు ఇండిగో తరుపున సీనియర్ న్యాయవాది సందీప్ సేథీ కోర్టుకు తెలియజేశారు.
Also Read
- SUV Safety: ఎస్‌యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
- Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్‌లో కూడా విడుదలవుతుందా?
- BMW X6 Facelift: భారత్‌లో BMW X6 ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. 530HP పవర్, జస్ట్ 4.3 సెకన్స్ లో 100kmph స్పీడ్
- TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్‌తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
Read Also: Mahindra XEV 7e: లాంచ్‌కు ముందు ఫోటో లీక్.. డిజైన్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
వివాదం ఇదే:
ఇండిగో తన బ్రాండ్ గుర్తింపుకు ‘‘6E’’ పేరుతో సేవల్ని, వసతులని బ్రాండింగ్ చేస్తోంది. ఈ కాల్ సైన్ కింద 6E ప్రైమ్, 6E ఫ్లెక్స్, 6E యాడ్-ఆన్‌లతో సహా అనేక ప్రయాణీకుల-కేంద్రీకృత సేవలను ఎయిర్‌లైన్ అందిస్తుంది. ఇండిగో ‘‘’6E లింక్’’ అనే ట్రేడ్ మార్క్‌ని 2015లో రిజిస్టర్ చేయించింది. అయితే, మహీంద్రా ఎలక్ట్రిక్ ‘BE 6E’ కింద ట్రేడ్ మార్క్ రిజిస్ట్రార్ నుంచి ఆమోదం పొందింది. మహీంద్రా ఎలక్ట్రిక్ 12 క్లాస్ కింద ‘BE 6E’ని రిజిస్టర్ చేయించింది. ప్రస్తుతం ఇది మొత్తం వివాదానికి కారణమైంది.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!