Mahindra XEV 9s: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహీంద్రా XEV 9S ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను (ఎక్స్-షోరూమ్) రూ. 19.95 లక్షలుగా ప్రకటించింది. భారతదేశపు మొట్టమొదటి టాప్-3 స్థానంలో SUV XEV 9S చోటు దక్కించుకుంది. అయితే, ఈ కారును ప్రత్యేకమైన INGLO ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. కాగా, ఇప్పటికే XEV 9e మార్కెట్ లో ఉండగానే.. ఈ మోడల్ ను తీసుకొచ్చారు. అయితే, SUV XEV 9e కంటే రూ. 1.95 లక్షలు తక్కువ ధరకే ప్రారంభమవుతుంది. టెస్ట్ డ్రైవ్‌లు డిసెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక, కొత్త బుకింగ్‌లు జనవరి 14వ తేదీ 2026 నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ కార్ల డెలివరీలు 2026 జనవరి 23వ తేదీ నుంచి మొదలవుతాయి.
Read Also: Adilabad: నామినేషన్ రోజే మరో సర్పంచ్ ఏకగ్రీవం..
ఇక, ఎక్స్టీరియర్ డిజైన్ XEV 9eతో పాటు 2022లో ప్రదర్శించిన XUV.e8 కాన్సెప్ట్ నుంచి స్ఫూర్తి పొందినదే ఈ XEV 9S ఎలక్ట్రిక్ కారు. కాగా, ఈ వెహికిల్ లుక్ ముందు భాగంలో క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, సొగసైన కనెక్టెడ్ DRLలు, త్రిభుజాకార LED హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉండటమే.. దీనికి ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తాయి. అలాగే, పొడవైన, ఫ్లాట్ బోనెట్, స్టాన్స్ దీని రోడ్ ప్రెజెన్స్‌ను పెంచుతాయి. పక్క నుంచి చూస్తే, 2,762mm వీల్‌బేస్, ముందు (915mm), వెనుక (1,099mm) ఓవర్ హాంగ్స్‌తో పాటు క్యాబిన్ స్థలాన్ని కూడా పెంచారు. వెనుక డిజైన్ నిటారుగా మరియు చక్కగా ఉండి, స్మోక్డ్ LED టెయిల్ ల్యాంప్‌లతో పాటు బంపర్‌ను కలిగి ఉంది.
Read Also: Bhumi Pednekar : ఆ పద్ధతి.. నా తల్లి నుంచి నేర్చుకున్న
అయితే, 9e కంటే XEV 9S కొద్దిగా పెద్దదిగా ఉంది. SUVకి తగిన 219mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా అందిస్తుంది. థర్డ్ వరుసను మడవగా 527 లీటర్ల బూట్ స్పేస్, సెగ్మెంట్-లీడింగ్ 150-లీటర్ల ఫ్రంక్ (ముందు భాగంలో స్టోరేజ్ స్పేస్) వంటివి ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశాలు. 9Sతో సహా అన్ని INGLO-ఆధారిత మోడల్స్ మహీంద్రా యొక్క ప్రత్యేకమైన సీతాకోకచిలుక చిహ్నాన్ని కలిగి ఉంటాయి.
Read Also: Google Pixel 8a Offers: ఆఫర్లు బాబోయ్ ఆఫర్లు.. 53 వేల గూగుల్ పిక్సెల్ ఫోన్ 7 వేలకే!
XEV 9S: ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్లు
కాగా, XEV 9S కారు యొక్క ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. డాష్‌బోర్డ్ వెడల్పుగా డిజిటల్ క్లస్టర్, సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ తో పాటు ప్రత్యేక ప్యాసింజర్ డిస్‌ప్లేను ఏకీకృతం చేస్తుంది. ఒక ఎండ్ నుంచి మరో ఎండ్ వరకు ఉన్న ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ఉంటుంది. రెండవ వరుస ప్రయాణీకుల కోసం, ముందు సీట్ బ్యాక్‌లపై అదనంగా రెండు స్క్రీన్‌లు అమర్చబడ్డాయి. ఉన్నత శ్రేణి వేరియంట్‌లలో AR హెడ్-అప్ డిస్‌ప్లే కూడా ఇందులో లభిస్తుంది. బేస్ వేరియంట్‌లలో కూడా స్లైడింగ్, రిక్లైనింగ్ సెకండ్-రో సీట్లు, తెరవగలిగే పనోరమిక్ సన్‌రూఫ్ (BE 6, XEV 9e లలోని స్థిరమైన గ్లాస్ రూఫ్‌ల) అనేక ఇతర సౌకర్యాలు ఉన్నాయి.
టాప్ ట్రిమ్స్ ఫీచర్లు:
హార్మన్ కార్డాన్ ప్రీమియం ఆడియో
డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్
మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్
లెథరెట్ అప్‌హోల్‌స్టరీ
ADAS ఫీచర్లు, ఆటో పార్కింగ్ మరియు డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్
BYOD (Bring Your Own Device) ఇంటిగ్రేషన్ మరియు అధునాతన కనెక్టెడ్-కార్ ఫీచర్లు
‘బాస్ మోడ్’ ద్వారా వెనుక ప్రయాణీకులు అదనపు లెగ్‌రూమ్ కోసం ముందు సీట్లను ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయవచ్చు.
బ్యాటరీ ఛార్జింగ్, పనితీరు..
మహీంద్రా వివిధ రకాల బ్యాటరీ ప్యాక్ ఎంపికలను అందిస్తోంది:
59kWh
70kWh
79kWh
అన్ని వెర్షన్లు 175kW వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. ఇక, పని తీరు మాత్రం వేరియంట్‌ను బట్టి మారుతుంది.
* అత్యంత శక్తివంతమైన వెర్షన్లు కేవలం 7 సెకన్లలో 0–100kph వేగాన్ని అందుకుంటాయి (59kWh మోడళ్లకు 7.7 సెకన్లు),
* అన్ని వేరియంట్‌ల టాప్ స్పీడ్ 202kph.
* AC వాల్‌బాక్స్ ఛార్జర్‌ల ధర అదనం: 7.2kW ఛార్జర్ – రూ. 50,000; 11.2kW ఛార్జర్ – రూ. 75,000.
వేరియంట్ ధరలు (ఎక్స్-షోరూమ్)
వేరియంట్ బ్యాటరీ ప్యాక్ ధర (లక్షల్లో)
ప్యాక్ వన్ అబోవ్- 59kWh Rs 19.95
ప్యాక్ వన్ అబోవ్- 79kWh Rs 21.95
ప్యాక్ టూ అబోవ్- 70kWh Rs 24.45
ప్యాక్ టూ అబోవ్- 79kWh Rs 25.45
ప్యాక్ త్రీ 79kWh మాత్రమే- Rs 27.35
ప్యాక్ త్రీ అబోవ్ 79kWh మాత్రమే- ₹ 29.45
ప్రస్తుతం, XEV 9S భారత మార్కెట్లో ప్రత్యక్ష పోటీదారు లేకుండా కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక మాస్-మార్కెట్ మూడు-వరుసల ఎలక్ట్రిక్ SUV. Kia Carens Clavis EV, BYD eMax 7 వంటి మూడు-వరుసల EVలు MPV సెగ్మెంట్ వైపు మొగ్గు చూపడం వలన అవి వేరే ప్రతిపాదనగా ఉన్నాయి. ధర పరంగా, ఇది టాటా హారియర్ EV ఎంపోర్డ్ 75 AWDతో కొద్దిగా దగ్గరగా ఉన్నప్పటికీ, అది రెండు-వరుసల SUV. ఈ మహీంద్రా XEV 9S కారు 7-సీటర్, ఆ బ్రాండ్‌కు అత్యంత ముఖ్యమైన లాంచ్‌లలో ఒకటిగా చెప్పాలి. ఈ కారు ప్రారంభ ధర కేవలం రూ. 19.95 లక్షలు మాత్రమే.
https://twitter.com/mahindraesuvs/status/1993906729420239117