JSW Motors తొలి SUV ఎంట్రీ.. హైబ్రిడ్ టెక్నాలజీతో భారత మార్కెట్లోకి Jetour T2 i-DM..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JSW Motors Jetour T2 i-DM: దేశ ప్యాసింజర్ వాహన మార్కెట్ లోకి JSW మోటార్స్ సిద్ధమవుతోంది. కంపెనీ నుండి తొలి SUVను ఈ ఏడాది దివాళి పండుగకు ముందే లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ కొత్త SUV, అంతర్జాతీయంగా పేరు పొందిన Jetour T2 ప్లాట్‌ఫామ్‌పై తయారవుతుండగా.. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో అందించనున్నారు. మరి ఈ రాబోయే పూర్తి వివరాలను చూసేద్దామా..
పవర్, స్టైల్, పెర్ఫార్మెన్స్తో జనవరి 29న చైనాలో REDMI Turbo 5 సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇలా..!
Also Read
- Piaggio Sales: పియాజియో దూకుడు.. 49% అమ్మకాల వృద్ధితో కొత్త రికార్డు, వెస్పా స్కూటర్ల హవా!
- MG Comet EV: ఎంజీ కామెట్ EV కొనాలనుకుంటున్నారా? ధరలు పెంచిన కంపెనీ.. ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే?
- Honda ZR-V: హోండా ZR-V భారత్‌లో లాంచ్.. 7.9 సెకన్లలో 100 km/h స్పీడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో ప్రీమియం SUV
- Jeep Meridian: భారత్‌లో జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్ విడుదల.. కొత్త ఫీచర్లు, AI అసిస్టెంట్.. ధర ఎంతంటే?
ఈ లాంచ్‌తో JSW మోటార్స్ ఒక కారు తయారీదారుగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. భారతీయ రోడ్డు పరిస్థితులు, వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ SUVను డిజైన్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. నగరాల్లో రోజువారీ ప్రయాణాల కోసం ఎలక్ట్రిక్ అసిస్టెన్స్, హైవే ప్రయాణాల్లో పెట్రోల్ ఇంజిన్ సహకారంతో ఈ వాహనం ప్రాక్టికాలిటీతో పాటు ఇన్నోవేషన్‌ను అందించనుంది.
ప్రపంచ మార్కెట్లో Jetour T2 సాధారణ పెట్రోల్ ఇంజిన్ వెర్షన్లలో లభిస్తున్నప్పటికీ.. భారత్‌లో మాత్రం JSW Motors ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ అయిన Jetour T2 i-DMను లాంచ్ కానుంది. ఇది 1.5 లీటర్ హైబ్రిడ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అంతర్జాతీయంగా ఈ మోడల్ ఆల్-వీల్ డ్రైవ్, ఫ్రంట్-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అయితే భారత్‌కు ఏ వెర్షన్ వస్తుందన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. జెటూర్ బ్రాండ్ ప్రధానంగా SUVలు, క్రాస్ఓవర్ లపై దృష్టి సారించిన ఈ బ్రాండ్ రగ్గడ్ డిజైన్, ప్రీమియం ఫీల్‌తో గుర్తింపు పొందింది. Jetour T2 డిజైన్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ నుంచి ప్రేరణ పొందినట్లు కనిపిస్తుండగా, బాక్సీ లుక్‌తో బలమైన రోడ్ ప్రెజెన్స్‌ను కలిగి ఉంది.
ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్ ద్వారా ఈ వాహనం 156 PS పవర్, 220 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పనితీరు, ఇంధన సామర్థ్యం రెండింటికీ సమతుల్యతను అందించేలా ఈ సెటప్ రూపొందించబడింది. ఆధునిక డిజైన్, హైబ్రిడ్ టెక్నాలజీ, విశాలమైన ఇంటీరియర్స్‌తో Jetour T2 i-DM, JSW Motorsకు భారత మార్కెట్లో మంచి ఆరంభాన్ని అందించడంతో పాటు, వేగంగా ఎదుగుతున్న హైబ్రిడ్ SUV సెగ్మెంట్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వనుంది.
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్‌లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!