NTV Telugu Site icon

Hyundai Aura: కారు కొనాలనే వారికి శుభవార్త.. రూ. 43000 భారీ డిస్కౌంట్

Hyundai Aura

Hyundai Aura

సెడాన్ కార్లకు భారతీయ కస్టమర్లలో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ విభాగంలో మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా వంటి కార్లు బాగా ఫేమస్ అయ్యాయి. మీరు కూడా కొత్త సెడాన్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే అదిరిపోయే శుభవార్త ఉంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్.. సెడాన్ ఆరాపై ఈ (నవంబర్) నెలలో బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. నవంబర్ 2024లో హ్యుందాయ్ ఆరాను కొనుగోలు చేసే వినియోగదారులు రూ. 43,000 వరకు ఆదా చేసుకోవచ్చు. మరింత డిస్కౌంట్ వివరాల కోసం.. కస్టమర్‌లు తమ దగ్గర్లో ఉన్న డీలర్‌షిప్‌ను సంప్రదించండి. హ్యుందాయ్ ఆరా ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

Read Also: Health Tips For Eye: మీ కంటిచూపు మందగించినట్లు అనిపిస్తోందా..? ఈ చిట్కాలు పాటించండి

పవర్ ట్రైన్:
కారు పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడితే.. హ్యుందాయ్ ఆరాలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది గరిష్టంగా 83bhp శక్తిని, 114Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో CNG ఎంపిక కూడా అందుబాటులో ఉంది. సీఎన్జీ మోడ్‌లో గరిష్టంగా 69bhp శక్తిని, 95.2Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఇంజిన్‌లో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండింటిలో వస్తుంది. ప్రస్తుతం.. వినియోగదారులు హ్యుందాయ్ ఆరాను 6 రంగు ఆప్షన్లలలో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ప్రస్తుతం 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఫీచర్లు, ధర:
ఈ కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటో హెడ్‌లైట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా.. 6-ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ప్రయాణీకుల భద్రత కోసం టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. భారత మార్కెట్లో హ్యుందాయ్ ఆరా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్‌కు రూ.6.49 లక్షల నుండి రూ.9.05 లక్షల వరకు ఉంది.

Show comments