Hyundai Aura: కారు కొనాలనే వారికి శుభవార్త.. రూ. 43000 భారీ డిస్కౌంట్
- కొత్త సెడాన్ కారును కొనాలనే వారికి అదిరిపోయే శుభవార్త
- హ్యుందాయ్ ఆరాపై ఈ నెలలో బంపర్ డిస్కౌంట్లు
- నవంబర్ 2024లో ఈ కారు కొనుగోలు చేసే వినియోగదారులు..
- రూ. 43
- 000 వరకు ఆదా చేసుకోవచ్చు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెడాన్ కార్లకు భారతీయ కస్టమర్లలో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ విభాగంలో మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా వంటి కార్లు బాగా ఫేమస్ అయ్యాయి. మీరు కూడా కొత్త సెడాన్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే అదిరిపోయే శుభవార్త ఉంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్.. సెడాన్ ఆరాపై ఈ (నవంబర్) నెలలో బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. నవంబర్ 2024లో హ్యుందాయ్ ఆరాను కొనుగోలు చేసే వినియోగదారులు రూ. 43,000 వరకు ఆదా చేసుకోవచ్చు. మరింత డిస్కౌంట్ వివరాల కోసం.. కస్టమర్లు తమ దగ్గర్లో ఉన్న డీలర్‌షిప్‌ను సంప్రదించండి. హ్యుందాయ్ ఆరా ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
Read Also: Health Tips For Eye: మీ కంటిచూపు మందగించినట్లు అనిపిస్తోందా..? ఈ చిట్కాలు పాటించండి
Also Read
- Nissan Tecton SUV: నిస్సాన్ టెక్టన్ SUV జూలై 9న ఆవిష్కరణ.. ప్రీమియం ఫీచర్లతో క్రెటా, సెల్టోస్‌కు గట్టి పోటీ
- Hero Flex Fuel Bikes: హీరో మోటోకార్ప్ సంచలనం.. దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్స్ స్ప్లెండర్, HF డీలక్స్ మార్కెట్లోకి..
- EV Sales India 2026: ఈవీ అమ్మకాల జోరు.. మే నెలలో రికార్డు స్థాయిలో 150,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు సేల్..!
- Electric Scooters: ఓలా, టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా.. వీటిలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్? పూర్తి వివరాలు
పవర్ ట్రైన్:
కారు పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడితే.. హ్యుందాయ్ ఆరాలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 83bhp శక్తిని, 114Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో CNG ఎంపిక కూడా అందుబాటులో ఉంది. సీఎన్జీ మోడ్‌లో గరిష్టంగా 69bhp శక్తిని, 95.2Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఇంజిన్‌లో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండింటిలో వస్తుంది. ప్రస్తుతం.. వినియోగదారులు హ్యుందాయ్ ఆరాను 6 రంగు ఆప్షన్లలలో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ప్రస్తుతం 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ఫీచర్లు, ధర:
ఈ కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఏసీ, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, ఆటో హెడ్లైట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా.. 6-ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ప్రయాణీకుల భద్రత కోసం టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. భారత మార్కెట్లో హ్యుందాయ్ ఆరా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్‌కు రూ.6.49 లక్షల నుండి రూ.9.05 లక్షల వరకు ఉంది.
తాజావార్తలు
-
Prabhas : ‘స్పిరిట్’ పవర్ఫుల్ డైలాగ్ లీక్? థియేటర్స్ షేక్ అవడం గ్యారెంటీ
-
OTT : పెద్ద సినిమాలకు ఓటీటీ డీల్ కాకుంటే రిలీజ్ డేట్ ప్రకటించరా?
-
Google AI Scam Call Detection: గూగుల్ నుంచి కొత్త AI స్కామ్ కాల్ డిటెక్షన్ ఫీచర్.. యూజర్లకు భారీ ఊరట
-
Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్‌కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
-
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!