Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Impulse: హీరో మోటోకార్ప్ లైనప్‌లో ఎంతో క్రేజ్ ఉన్న ఓ పాత మోటార్‌సైకిల్ మళ్లీ కొత్త అవతారంలోకి రాబోతుందా? అవుననే అంటున్నాయి ఇటీవల లీకైన డిజైన్ పేటెంట్ చిత్రాలు. భారత మార్కెట్లో ప్రస్తుతం ఆఫ్-రోడ్, అడ్వెంచర్ బైక్‌లకు మంచి గిరాకీ ఉంది. ఈ క్రమంలో హీరో మోటోకార్ప్ ఒక కొత్త డ్యూయల్-స్పోర్ట్ మోటార్‌సైకిల్ డిజైన్‌ను పేటెంట్ చేయించడంతో ఐకానిక్ ‘ఇంపల్స్’ బైక్ మళ్లీ తిరిగొస్తోందనే ప్రచారం జోరందుకుంది. లీకైన పేటెంట్ ఫోటోలను పరిశీలిస్తే.. ఈ కొత్త బైక్ డిజైన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ‘ఎక్స్‌పల్స్’ (Xpulse) మోడల్‌కు పూర్తిగా భిన్నంగా ఉంది. ఇందులో ఆయిల్ కూలర్ లేకపోవడం, చిన్నపాటి ఎయిర్-కూల్డ్ ఇంజిన్, కిక్ స్టార్టర్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి కంపెనీ 150 సీసీ నుంచి 200 సీసీ సామర్థ్యంతో కూడిన తేలికపాటి, చౌకైన ఆఫ్-రోడ్ బైక్‌ను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సాంకేతికంగా ఇది మార్కెట్లో ఉన్న Xpulse 200 4V, Xpulse 210 కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చి, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ఎంట్రీ-లెవెల్ అడ్వెంచర్ టూరర్గా మారే అవకాశం ఉంది.
ఈ బైక్ డిజైన్ పేటెంట్లో ఇంజిన్ ఎడమ వైపున ‘ఫ్యూయల్ టాప్’ కనిపించడం వల్ల ఇది కార్బొరేటర్ సెటప్‌తో వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత బీఎస్ (BS) నిబంధనల (Emission Norms) ప్రకారం కార్బొరేటర్ ఇంజిన్లకు అనుమతి లేదు కాబట్టి, ఈ మోడల్‌ను కార్బొరేటర్ ఇంజిన్లు చెల్లే ఇతర విదేశీ మార్కెట్ల ఎగుమతి కోసం తయారుచేస్తుండవచ్చు. అయితే ఫోటోలలో ఫ్రంట్ నంబర్ ప్లేట్, చీర గార్డ్ వంటి భాగాలు కూడా కనిపిస్తుండటంతో.. భారత మార్కెట్ కోసం కూడా హీరో వేరే రకమైన వెర్షన్‌ను రూపొందిస్తున్నట్లు భావిస్తున్నారు. ఇక, హీరో సంస్థ ఈ ‘ఇంపల్స్’ బైక్‌ను మొదటగా అక్టోబర్ 2011లో రూ. 66,800 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. హోండా నుంచి విడిపోయిన తర్వాత ‘హీరో మోటోకార్ప్’ బ్రాండ్ పేరుతో వచ్చిన తొలి బైక్ ఇదే. 149.2 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్, 5-స్పీడ్ గేర్‌బాక్స్, 245 mm గ్రౌండ్ క్లియరెన్స్, లాంగ్ ట్రావెల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, నైట్రాక్స్ గ్యాస్ ఫిల్డ్ రియర్ మోనోషాక్, ఎత్తైన ఎగ్జాస్ట్, మోటోక్రాస్ తరహా సీటుతో ఆఫ్-రోడింగ్‌కు ఇది ఎంతో అనువుగా ఉండేది. కానీ ఆ సమయంలో సరైన ఆదరణ లేకపోవడం, ఆ తర్వాత BS-4 నిబంధనలు రావడం వల్ల అమ్మకాలు తగ్గిపోవడంతో కంపెనీ 2017లో దీని ఉత్పత్తిని నిలిపివేసింది. ఇప్పుడు సరికొత్త డిజైన్ పేటెంట్‌తో మళ్లీ ఈ బైక్ వార్తల్లో నిలిచింది.
Also Read
- Kia Sorento: టయోటా ఫార్చ్యూనర్‌కు సవాల్.. రూ. 28 లక్షలకే బిగ్ ఎస్యూవీ.. ఏపీలోనే తయారీ!
- Volkswagen Tukan Pickup: వోక్స్వ్యాగన్ టుకాన్ పికప్ ఆవిష్కరణ.. రగ్డ్ డిజైన్, 1.5 TSI హైబ్రిడ్ ఇంజిన్
- 7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
- TVS Ronin Price Hike: టీవీఎస్ Ronin ఆరు వేరియంట్ల ధరలు పెంపు.. కొత్త ప్రైస్ లిస్ట్ ఇదే
తాజావార్తలు
-
Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
-
Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
-
Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
-
Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో కొత్త 5G ఫోన్
-
ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!