Ratan Tata: టాటా ఇండికా నుంచి నెక్సాన్ ఈవీ వరకు.. భారత ఆటో ఇండస్ట్రీపై చెరగని సంతకం రతన్ టాటా..
- ఇండికా నుంచి నెక్సాన్ ఈవీ వరకు..
- భారత ఆటో ఇండస్ట్రీపై రతన్ టాటా చెరగని సంతకం..
- జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కొనుగోలుతో ప్రపంచ ప్రఖ్యాతి..
- ఈవీ రంగంలో తనదైన ముద్ర వేసిన టాటా మోటార్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ratan Tata: రతన్ టాటా.. భారత పారిశ్రామిక రంగంపై చెరగని ముద్ర వేశారు. గుండు సూది నుంచి విమానాల వరకు అనేక కంపెనీలతో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో టాటా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. అయితే ఆటోమోటివ్ ఇండస్ట్రీలో రతన్ టాటా చెరగని ముద్ర వేశారు. ఇండికా నుంచి మొదలైన టాటా మోటార్స్ ప్రస్థానం ఇప్పుడు టాటా నెక్సాన్.ఈవీ దాకా కొనసాగింది. ప్రస్తుతం ఇండియాలో ఈవీ కార్లలో టాటా తిరుగులేని స్థానంలో ఉంది.
డిజిల్ ఆధారిత ‘‘ఇండికా’’ కారుని తీసుకువచ్చినప్పుడు పెద్దగా సేల్స్ లేకపోవడంతో పొడక్షన్ యూనిట్‌ని అమ్మేద్దామని రతన్ టాటా అనుకున్నారు. ప్రముఖ బ్రిటిష్ ఆటోమేకర్ కంపెనీ ఫోర్డ్‌తో డీల్ కుదుర్చుకునేందుకు వెళ్తే, సదరు సంస్థ సీఈఓ టాటాని అవమానించారు. చివరకు ఫోర్డ్ దివాళా తీసే పరిస్థితుల్లో దాని బ్రాండ్స్ ‘‘జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్’’ని కొనుగోలు చేశారు. టాటా చేతిలో పడిన తర్వాత ఈ బ్రాండ్స్ లాభాల బాట పట్టాయి. తనను అవమానించిన కంపెనీ బ్రాండ్లను టాటా కొనుగోలు చేయడం ఓ సంచలనం.
Also Read
- 7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
- TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్‌లకు గట్టి పోటీ
- Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
- Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
Read Also: Ratan Tata Dog: రతన్ టాటా భౌతికకాయం దగ్గర దీనంగా కూర్చున్న కుక్క
ఇండికా కార్ తర్వాత అనతి కాలంలోనే టాటా మోటార్స్ దేశీయం, విదేశాల్లో సత్తా చాటింది. టాటా కార్లు నమ్మకానికి కేరాఫ్‌గా ఉన్నాయి. టాటా మోటార్స్‌కి చెందిన నెక్సాన్ దేశంలోనే తొలి ఎన్-కాప్ రేటింగ్స్‌లో 5-స్టార్ సాధించిన తొలి కారుగా రికార్డుకెక్కింది. టాటా కార్లలో టియాగో, టిగోర్, నెక్సాన్, హారియర్, సఫారీ ఇవన్నీ ప్రయాణికులు సేఫ్టీకి తొలి ప్రాధాన్యం ఇచ్చాయి. తమ కార్లను ప్రమాదాలను తట్టుకునే విధంగా బిల్ట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేశారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో టాటా టాప్ ప్లేస్‌లో ఉంది. మహీంద్రా, బీవైడీ, ఎంజీ వంటి ప్లేయర్లు మార్కెట్లో ఉన్నప్పటికీ.. ఎక్కువ మంది టాటా మోటార్స్ ఈవీ కార్లనే కొనుగోలు చేస్తున్నారు. ఈవీ కేటగిరిలో దేశవ్యాప్తంగా నెక్సాన్. ఈవీ అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవే కాకుండా ఈవీ ఫోర్ట్‌ఫోలియోలో టియాగో, టిగోర్, నెక్సాన్, కర్వ్ వంటి ఈవీ కార్లు ఉన్నాయి. త్వరలోనే టాటా హారియర్ ఈవీ కూడా రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు ఎలాన్ మస్క్ ‘టెస్లా’ ఫేమస్. కానీ టెస్లా కారు కంటే ఎంతో చౌకగా అంటే రూ. 20 లక్షల లోపే అధునాతన ఫీచర్లు, అధిక రేంజ్, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా టాటా ఈవీ కార్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Today Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో.. తగ్గాయా? పెరిగాయా?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
-
Rebal Star Fans : రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!