Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Electric Vehicles Cause More Pollution Than Petrol And Diesel Vehicles

Electric Vehicles: పెట్రోల్ – డీజిల్ కంటే ఎలక్ట్రిక్ వాహనాలతో అధిక కాలుష్యం!

Published Date :January 30, 2025 , 7:44 pm
By RAMAKRISHNA KENCHE
  • పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్ వాహనాల కాన్సెప్ట్‌
  • వాటి వల్లే అధిక కాలుష్యం
  • బ్యాటరీల తయారీ ప్రమాదకరం
  • పాడైన బ్యాటరీలు ప్రకృతికి ప్రమాదం
  • ఒక్కొక్కటిగా అన్ని అంశాలు అర్థం చేసుకుందాం
Electric Vehicles: పెట్రోల్ – డీజిల్ కంటే ఎలక్ట్రిక్ వాహనాలతో అధిక కాలుష్యం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్ వాహనాల కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని కార్ల కంపెనీలు మాత్రమే ఈవీలను తయారు చేసేవి. ప్రస్తుతం అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. ఎందుకంటే భారత ప్రభుత్వం ఈవీలను ప్రమోట్ చేస్తోంది. ఇటీవల.. భారత ప్రభుత్వం రూ. 10,900 కోట్లతో కూడిన పీఎమ్‌ఈ డ్రైవ్ స్కీమ్‌ను ఆమోదించింది. తద్వారా ప్రజలు మరింత ఎక్కువ ఈవీలను కొనుగోలు చేశారు. ఇందుకు సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ఈ కార్లకు జీఎస్‌టీ, పన్ను, పర్మిట్‌లలో మినహాయింపు వంటి అనేక ద్రవ్య ప్రయోజనాలు కూడా అందిస్తున్నారు. 2030 నాటికి ప్రైవేట్ ఎలక్ట్రిక్ కార్లలో 30 శాతం, ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలలో 80 శాతం వృద్ధిని సాధించాలని ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది. భారతదేశంలో ఈవీ మార్కెట్ పుంజుకోవడానికి ఇదే కారణం.

ఊహించలేనంత కాలుష్యం..
2030 నాటికి భారతదేశంలో ఈవీ మార్కెట్ $100 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణ అనుకూలమైనవిగా పరిగణిస్తారు. ఎందుకంటే అవి కాలుష్యాన్ని నాశనం చేయవు, శబ్దం చేయవు అని భావిస్తుంటారు. కానీ నమ్మలేని కొన్ని నిజాలు కూడా ఉన్నాయి.. వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.. నిజానికి పెట్రోల్-డీజిల్ కార్ల కంటే ఈ వాహనాల వల్ల పర్యావరణానికి ఎక్కువ హాని కలుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి ప్రక్రియ, వాటి బ్రేక్‌లు, టైర్లు లేదా వాటి బ్యాటరీలు ఊహించలేనంత కాలుష్యాన్ని కలిగిస్తాయి. ఎలా, ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం.

ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్రక్రియలో పొంచి ఉన్న ప్రమాదం..
ఈవీ, సాధారణ ఇంజిన్‌ల ఉద్గారాలను పోల్చినప్పుడు.. ఈవీలను ఉత్పత్తి చేసేటప్పుడు 46 శాతం కార్బన ఉద్గారాలు వస్తున్నట్లు కనుగొన్నారు. సాధారణ వాహనాల్లో ఇది 26 శాతంగా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఎలక్ట్రిక్ కారును తయారు చేసే ప్రక్రియలో దాదాపు 5-10 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. ఇది పర్యావరణానికి చాలా ప్రమాదం.. ఈవీ, సాధారణ వాహనంలో బాడీ, ఛాసిస్, ఇతర భాగాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. వాటి తయారీలో అల్యూమినియం, స్టీల్ వంటి లోహాలను ఉపయోగిస్తారు. అయితే ఈవీ బ్యాటరీతో నడుస్తుంది. వీటిల్లో లిథియం అయాన్ బ్యాటరీలు ఉపయోగిస్తారు. ఇవి భూమిలో లభించే అరుదైన లోహాలతో తయారు చేస్తారు. ఐఎమ్‌ఎఫ్ నివేదిక ప్రకారం.. సాధారణ ఈవీ బ్యాటరీని తయారు చేయడానికి 8 కిలోల లిథియం, 35 కిలోల మాంగనీస్, 6 నుంచి 12 కిలోల కోబాల్ట్ అవసరం. వీటిలో, కోబాల్ట్ అరుదైన ఎర్త్ మెటల్. ఇది సులభంగా లభ్యం కాదు. కాబట్టి బ్యాటరీ తయారీలో దాని పరిమాణాన్ని తగ్గించడానికి కోబాల్ట్ కంటే చౌకైన నికెల్‌ను ఉపయోగిస్తారు. ఒక్క బ్యాటరీ తయారీలో ఇవన్నీ ఉపయోగిస్తారు. అయితే ఈ లోహాల మైనింగ్ అతిపెద్ద పర్యావరణ ఆందోళన. లిథియం, కోబాల్ట్ వంటి లోహాలను భూమి నుంచి తీస్తే 4,275 కిలోల యాసిడ్ వ్యర్థాలు, 57 కిలోల రేడియోధార్మిక అవశేషాలు ఉత్పత్తి అవుతాయి.

లిథియం ఎందుకు ప్రమాదకరం?

ఒక టన్ను లిథియం దాదాపు 100 ఈవీ వాహనాలకు బ్యాటరీలను తయారు చేయగలదు. అయితే ఈ ఒక టన్ను లిథియంను వెలికితీయాలంటే 2 మిలియన్ టన్నుల నీరు అవసరం. ఒక ఈవీకి చెందిన బ్యాటరీ తయారీకి 13,500 లీటర్ల నీటిని వినియోగిస్తారు. అయితే పెట్రోల్ కారు దాదాపు 4,000 లీటర్లు వినియోగిస్తుంది. దీని వల్ల చిలీ, బొలీవియా, అర్జెంటీనా దేశాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. ఒక్క చిలీలో 65 శాతం నీటిని లిథియం తీయడానికి వాడుతున్నారు. నికెల్, కోబాల్ట్ గనులు ఉన్న క్యూబాలో దాదాపు 570 హెక్టార్ల భూమి బీడుగా మారింది. 10 కిలోమీటర్లకు పైగా ప్రాంతం కలుషితమైంది. అధిక కాలుష్యం కారణంగా ఫిలిప్పీన్స్ 23 నికెల్, కోబాల్ట్ గనులను మూసివేయవలసి వచ్చింది. అల్యూమినియం గురించి మాట్లాడినట్లయితే.. ఈవీ తయారు చేయడానికి సుమారు 250 కిలోల అల్యూమినియం ఉపయోగించబడుతుంది. ఇది సగటు పెట్రోల్ లేదా డీజిల్ ఇంజన్ కంటే 25-27% ఎక్కువ. 2030 నాటికి ఈవీ పరిశ్రమ డిమాండ్‌ను తీర్చడానికి 10 మిలియన్ టన్నుల అల్యూమినియం అవసరం అవుతుంది.

ఛార్జింగ్ ప్రక్రియ కూడా ప్రమాదమే..
ఈవీ ఛార్జింగ్ పర్యావరణానికి చాలా అనుకూలంగా కనిపించడం లేదు. ప్రజలు ఇంట్లో లేదా ఛార్జింగ్ స్టేషన్లలో ఈవీలను ఛార్జ్ చేస్తారు. అయితే వాటికి ఛార్జ్ చేస్తున్న విద్యుత్ ఎక్కడ, ఎలా ఉత్పత్తి అవుతోంది? రికార్డో కన్సల్టెన్సీ ప్రకారం.. బొగ్గుతో ఉత్పత్తి చేయబడిన విద్యుత్‌తో ఈవీని ఛార్జ్ చేస్తే, 1.5 లక్షల కిలోమీటర్లు నడిపిన తర్వాత, అది పెట్రోల్ కారు కంటే 20% తక్కువ కార్బన్‌ను మాత్రమే విడుదల చేస్తుంది. భారతదేశంలో 70% విద్యుత్ బొగ్గు నుంచి ఉత్పత్తి చేస్తారు.

 చెడిపోయిన బ్యాటరీలతో ముప్పు!
బ్యాటరీ జీవితం ముగిసినప్పుడు.. వాటిని పారేయాల్సి ఉంటుంది. లేదా పల్లపు ప్రదేశాలలో పాతి పెట్టాలి. ఇది పర్యావరణానికి మరింత ప్రమాదకరం. ఇది కార్బన్ వ్యప్తిని మరింత పెంచుతుంది. బ్యాటరీలను రీసైక్లింగ్ చేసే ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది. కొన్ని కంపెనీలు బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసినప్పటికీ.. మొత్తం బ్యాటరీలలో 5 శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి. లిథియం ప్రపంచంలోనే అత్యంత తేలికైన లోహం అని అరిజోనా విశ్వవిద్యాలయం ఎకాలజీ విభాగానికి చెందిన ఎమెరిటస్ ప్రొఫెసర్ గై మెక్‌ఫెర్సన్ చెప్పారు. “ఇది చాలా సులభంగా ఎలక్ట్రాన్‌లను వదులుతుంది. లిథియం గ్రీన్ ఫ్యూయల్ అని కీర్తించబడుతోంది. కానీ దానిని భూమి నుంచి తీయడం పర్యావరణానికి 3 రెట్లు ఎక్కువ విషపూరితం. 98.3% లిథియం బ్యాటరీలను ఉపయోగించిన తర్వాత గుంతల్లో పాతిపెట్టాల్సి వస్తుంది. బ్యాటరీ పాడయ్యాక నీటితో చర్య జరుపుతుంది. ఒక వేళ దానికి నీరు తగిలితే.. వెంటనే మండుతుంది. జూన్ 2017 నుంచి డిసెంబర్ 2020 వరకు.. అమెరికాలోని పసిఫిక్ నార్త్‌వెస్ట్‌లోని ఒక పిట్‌లో ఈ బ్యాటరీల నుంచి 124 ప్రమాదాలు జరిగాయి.” అని ఆయన వెల్లడించారు.

ఎలక్ట్రిక్ వాహనాల అధిక బరువు వల్ల..
ఇతర ఇంధనాలతో నడిచే కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాల బ్రేక్‌లు, టైర్లు 1850 రెట్లు ఎక్కువ కాలుష్యాన్ని వ్యాపింపజేస్తాయని ఓ పరిశోధన నివేదిక పేర్కొంది. ఎమిషన్ అనలిటిక్స్ నివేదిక ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ బరువు కలిగి ఉంటాయి. ఈ అదనపు బరువు బ్రేక్‌లు, టైర్లపై పడి వాటి జీవితకాలం వేగంగా తగ్గిపోతుంది. అధిక బరువు కారణంగా దాని టైర్లు త్వరగా అరిగిపోతాయి. త్వరగా అరిగిపోయిన టైర్లు హానికరమైన రసాయనాలను గాలిలోకి విడుదల చేస్తాయి. చాలా టైర్లు సింథటిక్ రబ్బరుతో తయారు చేస్తారు. ఇవి కాలుష్యానికి ప్రమాదం. ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో అమర్చిన ఈ అర టన్ను బ్యాటరీ పెట్రోల్ కారు కంటే 400 రెట్లు ఎక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుందని నివేదిక వెల్లడించింది.

ఎకో ఫ్రెండ్లీ అని ఎలా అంటారు?
ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే ఈవీలను ఎకో ఫ్రెండ్లీ అని ఎలా అంటారు? కాబట్టి ఎలక్ట్రిక్ వాహనం యొక్క భావన తప్పు అని భావించాలా? అనే ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. ఈవీ కార్ల తయారీ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అందుకే ఇందులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ ఈవీలను ఛార్జ్ చేయడానికి ఉపయోగించే విద్యుత్ బొగ్గు నుంచి తీసుకోకపోతే, మైనింగ్ ప్రక్రియను డీకార్బనైజ్ చేసినట్లయితే ఈవీలు పర్యావరణ అనుకూలమైనవిగా మారవచ్చు. దాని బ్యాటరీని రీసైకిల్ చేయడానికి, చెడిపోయిన బ్యాటరీలను సురక్షితంగా మట్టిలో కలిసి పోయేలా చేస్తే.. ఈవీలు కూడా ప్రకృతికి మేలు చేసేవిగా తయారవుతాయి. ఈవీల తయారీ ప్రారంభదశలోనే ఉంది. కాబట్టి ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Diesel Vehicles
  • Electric Vehicles
  • ev Vehicles
  • Petrol Vehicles
  • vehicles

తాజావార్తలు

  • COP33 Climate Summit 2028: COP33 వాతావరణ సదస్సు.. ఆతిథ్యం ప్రతిపాదనను ఉపసంహరించుకున్న భారత్

  • Iran: మళ్లీ మూతపడ్డ హోర్ముజ్ జలసంధి.. ఇరాన్ యు-టర్న్ వెనుక అసలు కారణం ఇదే!

  • RAAKA : గురువు చేయలేనిది.. శిష్యుడు చేస్తున్నాడా?

  • KKR vs LSG: తొలి విజయం కోసం ఎదురుచూపులు.. నేడు లక్నోతో కేకేఆర్ ఢీ

  • Israel-Lebanon War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 254కు చేరిన మృతులు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions