Hyundai, Tata, Maruti Suzuki, Kia: దేశంలో దీపావళి పండుగ సీజన్ ప్రారంభమవడంతో ఆటోమొబైల్ కంపెనీలు తమ అమ్మకాలను పెంచేందుకు భారీ ఆఫర్లను ప్రకటించాయి. కొత్త GST సవరణలతో మార్కెట్ లో వాహనాల ధరలు ఇప్పటికే తగ్గిన నేపథ్యంలో.. ఇప్పుడు కంపెనీలు మరింతగా ఫెస్టివ్ ఆఫర్లను అందిస్తూ వినియోగదారులకు బంపర్ ఆఫర్స్ ను అందిస్తున్నాయి. అయితే రాష్ట్రానికి, డీలర్ విధానానికి అనుసరించి ఈ ఆఫర్లు కొద్దిగా మారవచ్చు. మరి ఏ కంపెనీ వాహనాలపై ఎంత డిస్కౌంట్ ఉందొ చూసేద్దామా..
టాటా మోటార్స్ (Tata Motors):
టాటా మోటార్స్ కూడా పండుగ సీజన్‌కి అనుగుణంగా పలు మోడళ్లపై ఆఫర్లు ప్రకటించింది. టియాగో (Tiago)పై రూ.10,000 క్యాష్ + రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. అలాగే టిగోర్(Tigor)పై రూ.30,000 వరకు, పంచ్ (Punch)పై రూ.20,000 వరకు బెనిఫిట్లు ఉన్నాయి. Nexonపై రూ.25,000 వరకు క్యాష్ + ఎక్స్చేంజ్ ఆఫర్లు లభిస్తాయి. కొత్తగా లాంచ్ అయిన Curvv, Harrier (Fearless X), Safari (Accomplished X) మోడళ్లపై కూడా రూ.50,000 వరకు బెనిఫిట్లు లభ్యమవుతున్నాయి. ఇక టాటా గ్రూప్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేట్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
హ్యుందాయ్ (Hyundai):
హ్యుందాయ్ కూడా ఈ సీజన్‌కి భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. Grand i10 Nios పై రూ.30,000 వరకు క్యాష్ + రూ.25,000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది.ఇంకా Auraపై రూ.30,000 వరకు, Exterపై రూ.45,000 వరకు, i20పై రూ.50,000 వరకు బెనిఫిట్లు అందిస్తున్నది. అలాగే Venue 1.2 పై రూ.45,000 వరకు, Venue Turboపై రూ.25,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. కార్పొరేట్ కస్టమర్లకు అదనపు రూ.5,000 లాభం కూడా లభించనుంది.
హోండా కార్స్ (Honda Cars):
హోండా తన Amaze 3rd Genపై రూ.67,000 వరకు భారీ బెనిఫిట్లు అందిస్తుంది. City మోడల్ పై ఏకంగా రూ.1.27 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్, అలాగే 7 సంవత్సరాల వారంటీ ఉన్నాయి. ఇక Elevate MT కారుపై రూ.1.32 లక్షల వరకు ఆఫర్లు ఉండగా, City eHEV Hybridకు 7 సంవత్సరాల వారంటీ అందిస్తున్నారు.
మారుతి సుజుకి (Maruti Suzuki):
మారుతి సుజుకి పలు పాపులర్ మోడళ్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. Alto K10 పై పెట్రోల్, CNG వేరియంట్లకు రూ.52,500 వరకు లాభాలు అందుబాటులోకి తీసుక వచ్చింది. ఇంకా S-Presso మోడల్ పై రూ.47,500 వరకు, Wagon R పై రూ.57,500 వరకు, Celerio పై రూ.52,500 వరకు బెనిఫిట్లు లభిస్తాయి. ఇక పాపులర్ Swift వేరియంట్లపై రూ.48,750 వరకు ఆఫర్ ఇవ్వబడింది. Brezza సబ్-4 మీటర్ SUVపై రూ.35,000 వరకు ఎక్స్చేంజ్ + స్క్రాపేజ్ ఆఫర్లు ఉన్నాయి. Ertigaపై రూ.25,000, Eecoపై రూ.42,500 వరకు మొత్తం బెనిఫిట్లు అందుబాటులో ఉన్నాయి. Tour S పై రూ.15,000, Tour H1 కారుపై రూ.65,500 వరకు ఆఫర్లు ప్రకటించారు. Baleno Delta AMT వేరియంట్‌పై ఏకంగా రూ.1,05,000 వరకు లాభాలు ఉండగా.. అందులో రూ.55,000 విలువైన రెగల్ కిట్, రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి. ఇంకా Invicto Alpha+ పై మొత్తం రూ.1,40,000 వరకు బెనిఫిట్లు, Invicto Zeta+ పై రూ.1,15,000 స్క్రాపేజ్ బోనస్ లభిస్తుంది. Fronx Turbo పై రూ.88,000 వరకు లాభాలు అందుబాటులో ఉన్నాయి.
కియా (Kia):
కియా మోటార్స్ కూడా ప్రముఖ SUVలపై భారీగా ఫెస్టివ్ డిస్కౌంట్లు ప్రకటించింది. ఇందులో Sonetపై రూ.10,000 క్యాష్, రూ.20,000 ఎక్స్చేంజ్, రూ.15,000 కార్పొరేట్ బెనిఫిట్ ఇవ్వనుంది. అలాగే Seltosపై రూ.75,000 వరకు మొత్తం లాభాలు, Syrosపై రూ.80,000 వరకు, Carens Clavisపై రూ.65,000 వరకు, ఇంకా Carnivalపై రూ.1,15,000 వరకు బెనిఫిట్లు ప్రకటించారు.
రెనాల్ట్ (Renault):
రెనాల్ట్ కూడా కొన్ని మోడళ్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో Kwidపై రూ.35,000 వరకు, Kiger Faceliftపై రూ.45,000 వరకు, Kiger Pre-faceliftపై రూ.80,000 వరకు, Triber Faceliftపై రూ.45,000 వరకు, అలాగే Triber Pre-faceliftపై రూ.75,000 వరకు మొత్తం బెనిఫిట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్‌లు ఉన్నాయి.