Himachal Pradesh Flash Floods: మెరుపు వరదలు.. ఇప్పటి వరకు 19 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal Pradesh Flash Floods: హిమాచల్ ప్రదేశ్ మెరుపు వరదులు, వర్షాలతో అతలాకుతలం అవుతోంది. కుంభవృష్టిగా వానలు కురవడంతో మెరుపు వరదుల, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. గత 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ పరిస్థితి ఏర్పడింది. మెరుపు వరదలు, వర్షాలు, కొండచరియలు విరిగి పడటం మూలంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 19 మంది మరణించగా.. 9 మంది గాయపడ్డారు. మరో ఐదుగురు గల్లంతయ్యారని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది.
గోహర్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని కషన్ గ్రామంలో కొండచరియల వల్ల ఇళ్లు కూలిపోవడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మండి, కాంగ్రా, చంబా జిల్లాల్లో అత్యధిక నష్టం నమోదు అయింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 36 వరదలు, ప్రమాదాల వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. మండి వద్ద మనాలి-చండీగఢ్ జాతీయ రహదారి, సిమ్లా – చండీగఢ్ హైపే కొండచరియలు విరిగిపడటంతో బ్లాక్ చేశారు. ఒక్క మండి జిల్లాలోనే మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల 13 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. షోఘి, తారా దేవి మధ్య సోను బంగ్లా వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. పఠాన్ కోట్- హిమాచల్ ప్రదేశ్ ను కలిపే చక్కి రైల్వే బ్రిడ్జ్ వరదల ధాటికి కూలిపోయింది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Read Also: Airport Name Change: పంజాబ్, హర్యానా ప్రభుత్వాల కీలక నిర్ణయం.. ఎయిర్ పోర్టు పేరు మార్పు
హిమాచల్ ప్రదేశ్ చంబా, బిలాస్ పూర్, సిర్మౌర్, మండి, కాంగ్రా జిల్లాల్లోని ఐసోలేటెడ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచానా వేసింది. టూరిస్టులు, ప్రజలు నదులు, వరద ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ నెల 25 వరకు కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని.. డిస్టాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రజలను హెచ్చరించింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!