సీఎం స్వంత జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సందడి చేశారు. కడప జిల్లాలో రైతు భరోసా యాత్రకు విచ్చేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. మాకు ఎదురు తిరిగితే చేతులు కట్టుకొక పోతే క్రింద కూర్చో బెడతామంటే సహించం అన్నారు పవన్. ఈ ముఖ్య మంత్రికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? ఇది ఆత్మ గౌరవానికి సంబంధించింది. ఆస్తులు పోయినా లెక్క చేయను..కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సిఎం జగన్ ను సొంత కొడుకులా చూసుకుంటారని చెప్పారు.
రాజకీయాల్లోకి సరదాకోసం రాలేదు.. మార్పు కోసం వచ్చానని స్పష్టం చేశారు పవన్. ఏ ఒక్కరినీ వర్గ శత్రువుగా పరిగణించం అన్నారు పవన్ కళ్యాణ్. ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా రాయలసీమను అభివృద్ధి చేస్తాం అన్నారు పవన్. మాటలు చెప్పే మనిషిని కాదు. పద్యం పుట్టిన పుణ్యభూమిలో మద్యం ప్రవహిస్తోందని ఆవేదన చెందారు. కౌలు రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటివరకు కడప జిల్లాలో 190 మంది కౌలు రైతులు చనిపోయారని గుర్తు చేశారు. బాధిత కౌలు రైతులను తమవంతుగా ఆదుకుంటామన్నారు.
మరి రాష్ట్రం లోని పెండింగ్ పనులు ఎందుకు చేయలేకపోతున్నారు. రాష్ట్రం కోసం పని చేయడం లేదు.. కేసుల కోసం భయపడుతున్నారు. ఏపీకి బంగారు భవిషత్ కోసం దెబ్బలు తినడానికి నేను సిద్దంగా ఉన్నా అన్నారు పవన్. జన సేన పార్టీ వైపు ఒక సారి చూడండి.. ప్రజలకు, ముఖ్యంగా రాయలసీమకు ఏం చేయాలో చేస్తా..మార్పు కోసం జనసేన ఉంది.. ప్రాధాన్యం లేని కులాలకు ప్రాధాన్యం వచ్చేలా చూస్తా అన్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో వారసత్వ రాజకీయాల్లో మార్పు రావాలి..
కులం, మతాలపై రాజకీయాలు సరికాదు.. నా కుటుంబంలోని వ్యక్తిని కూడా జగన్ చేతులు పట్టుకునేలా చేశారు.. చేతులు కట్టుకుని తనముందు నిలబడేలా చేశారు.. నేనెప్పుడూ కులమతాల గురించి ఆలోచించను అన్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో తన అన్న ప్రజారాజ్యం పార్టీ విలీనంపై పవన్ మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వైసీపీలో వున్న నేతలే అన్నయ్య పార్టీని విలీనం చేయించారని..ఆ పార్టీ ఇప్పుడు ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు పవన్ కళ్యాణ్. కేంద్రం మెడలు వంచుతానని, వైసీపీ ఎంపీలే ఢిల్లీలో మెడలు వంచుతున్నారన్నారు.
Read Also: Kerala Savari: కేరళ ప్రభుత్వ వినూత్న నిర్ణయం.. సొంతగా క్యాబ్ సర్వీస్ ప్రారంభం