ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. బడ్జెట్ ధరల్లో లభిస్తుండడంతో కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెట్రోల్ ఖర్చులు అధికమవుతుండడంతో ఈవీలకు ఆదరణ పెరిగింది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్ వెహికల్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. అయితే స్టైలిష్ లుక్, అద్భుతమైన రేంజ్ తో కూడిన బైకులు కావాలంటే అల్ట్రా వయోలెట్, రివోల్ట్ ఆర్వీ 400 బైకులు అందుబాటులో ఉన్నాయి. మంచి ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకునే వారు వీటిపై ఓ లుక్కేయండి.
అల్ట్రా వయోలెట్ F77 సూపర్ స్ట్రీట్:
స్టైలిష్ లుక్ లో అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకునే వారికి అల్ట్రా వయోలెట్ సూపర్ బైక్ అని చెప్పొచ్చు. అల్ట్రా వయోలెట్ F77 సూపర్ స్ట్రీట్ 2.99 లక్షల (ఎక్స్ షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇది రెండు రకాల సూపర్ స్ట్రీట్ స్టాండర్డ్, రీకాన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వేరియంట్ సింగిల్ ఛార్జ్ తో 211 కిలోమీటర్లు, రీకాన్ వేరియంట్ 323 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. ఈ బైక్ కొత్త హెడ్ లైట్ డిజైన్ తో వస్తుంది. వయోలెట్ ఏఐ ఎఫ్77 సూపర్ స్ట్రీట్ తో వచ్చే మొబైల్ అప్లికేషన్ ద్వారా మూవ్ మెంట్, క్లాష్ అలర్ట్స్, డైలీ రైడ్ గణాంకాలు, యాంటీ కొల్లిషన్ వార్నింగ్ సిస్టమ్ ను అందిస్తుంది.
revolt rv 400:
రివోల్ట్ మోటార్స్ రిలీజ్ చేసిన రివోల్ట్ ఆర్ వీ 400 అదిరిపోయే ఫీచర్లతో అందుబాటులో ఉంది. ఇది సింగిల్ ఛార్జ్ తో 150 కిలోమీటర్ల రేంజ్ ను ఇస్తుంది. కాంబి బ్రేకింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది.ఇందులో సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటు అనేక ఫీచర్స్ ను కలిగి ఉంది. మూడు రైడింగ్ మోడ్స్, ఎకో, నార్మల్, స్పోర్ట్స్ మోడ్ లలో అందుబాటులో ఉంది. ఈ బైక్ ధర రూ. 1.20లక్షలు.