Maharashtra: ఎయిర్‌బ్యాగే ప్రాణం తీసింది.. అసలేం జరిగిందంటే?
- మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం
- ఎయిర్‌బ్యాగ్ కారణంగా బాలుడు మృతి
- అసలు ఏం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ కారులో కూర్చున్న 6 ఏళ్ల బాలుడు ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోవడంతో మృతి చెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన ఎస్‌యూవీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు డ్రైవర్ కాస్మెటిక్ సర్జన్‌గా గుర్తించారు. అజాగ్రత్తగా వాహనం నడిపిన అతడిపై విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో కారులో కూర్చున్న మరికొందరు గాయపడ్డారు. అసలు ఏం జరిగిందంటే..
READ MORE:Bandi Sanjay : రాహుల్ గాంధీకి అంబేద్కర్ పంచ తీర్థాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా
Also Read
- TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
- Hyundai 26 New Cars: మారుతి, టాటా, మహీంద్రాకు షాక్.. హ్యుందాయ్ దూకుడు.. భారత మార్కెట్లోకి 26 కొత్త కార్లు
- Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
- 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
6 ఏళ్ల హర్ష మావ్జీ అనే బాలుడు.. మారుతి వ్యాగన్ఆర్ కారు ముందు సీటులో కూర్చున్నాడు. తండ్రి కారు నడుపుతున్నాడు. వెనకాల మరో ఇద్దరు కూర్చున్నారు. వీళ్ల కారుకు ముందు ఓ ఎస్‌యూవీ వెళ్తోంది. అకస్మాత్తుగా ముందు వెళ్తున్న ఎస్‌యూవీ డివైడర్‌ను ఢీకొని గాలిలోకి ఎగిరింది. ఈ బాలుడి కుటుంబం ప్రయాణిస్తున్న మారుతి వ్యాగన్ఆర్ బాడెట్‌ను కూడా ఢీకొంది. దీంతో వెంటనే కారులోని ఎయిర్‌బ్యాగ్ తెరుచుకుంది. ఈ ప్రమాదం తర్వాత.. హర్షను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్ష శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. అంతర్గత గాయాల కారణంగా మరణించినట్లు తెలిపారు. ఎయిర్ బ్యాగ్ తెరుచుకునే క్రమంలో బాలుడిని బలంగా ఢీకొట్టడంతో మరణించినట్లు తేలింది. కారులో కూర్చున్న మరో ముగ్గురుకి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఎస్‌యూవీ కారు డ్రైవర్ కూడా గాయపడ్డాడు. తన పిల్లలు పానీపూరీ తినాలని పట్టుబడటంతో బయటకు తీసుకెళ్లినట్లు తండ్రి తెలిపాడు. అంతలోనే ఇలా జరిగిందని వాపోయాడు. కాగా.. మంగళవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
READ MORE: IND vs AUS: బాక్సింగ్ డే టెస్టులో నితీష్ ఔట్..! ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందంటే..?
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!