MG Astor 2025:బ్రిటీష కార్ మేకర్ మోరిస్ గ్యారేజ్(MG) సరికొత్త అవతార్‌తో తన ‘‘ఆస్టర్’’ కారుని తీసుకురాబోతోంది. హైబ్రిడ్ కారుగా రాబోతోంది. మరిన్ని ఫీచర్లు, రివైజ్డ్ లుక్స్‌తో ZSని గ్లోబల్ మార్కెట్ ప్రవేశపెట్టనున్నారు. భారత్‌లో దీనిని ఆస్టర్ అని పిలుస్తారు. తాజాగా ఈ కారుకి సంబంధించిన వివరాలను ఎంజీ విడుదల చేసింది. హైబ్రీడ్ మోడల్ కాబట్టి దీంట్లో సంప్రదాయ పెట్రోల్-డిజిల్‌తో నిడిచే ఇంజన్‌తో పాటు దీనికి శక్తిని ఇచ్చేందుకు ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.
ఇంజన్-మోటార్ వివరాలు:
1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 102 PS పవర్‌తో పాటు 128 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్‌కి మరింత శక్తి అందించేందుకు 136 PS మరియు 250 Nm ఉత్పత్తి చేయగల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. మొత్తంగా కారు అవుట్‌పుట్ పవర్ 195 PS మరియు 465 Nmగా ఉంది. కారు గరిష్ట వేగం గంటలకు 167 కి.మీ కాగా, 0-100 కి.మీ వేగాన్ని కేవలం 8.7 సెకన్లలో అందుకోగలదు. దీనిలో మొత్తం మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.
డిజైన్‌లో మార్పులు:
ఫ్రంట్ ఫాసియా రీ రిజైన్ చేయబడింది. గతంలో ఆస్టర్ కన్నా మరింత స్పొర్టివ్‌గా రూపుదిద్దుకుంది. కొత్త LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, డై టైమ్ రన్నింగ్ లైట్లు, వెనుక లైట్లు సరికొత్త రూపాన్ని అందిస్తాయి. ఆర్కిటిక్ వైట్, బ్లాక్ పెర్ల్, మాన్యుమెంట్ సిల్వర్, హాంప్‌స్టెడ్ గ్రే, బాటర్‌సీ బ్లూ మరియు డైనమిక్ రెడ్ వంటి 6 కలర్స్‌లో అందుబాటులో ఉంది.
ఫీచర్స్ అండ్ సేఫ్టీ:
MG ZS హైబ్రిడ్+ రెండు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. SE మరియు ట్రోఫీ వేరియంట్లను కలిగి ఉంది. SEతో పోలిస్తే ట్రోఫీ వేరియంట్‌లో బ్లాక్ లెదర్ అప్హోల్స్టరీ, డ్రైవర్ సీటుకు 6-వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, హీటెడ్ స్టీరింగ్ వీల్ ఉంటాయి. యాక్టివ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్ విత్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు రియర్ క్రాసింగ్ ట్రాఫిక్ అలర్ట్ వంటి ఫీచర్లను కలిగి లెవల్ -2 ADAS స్టాండర్డ్‌గా వస్తుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్‌తో పాటు స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది.
భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే..?
JSW-MG మోటార్ ఇండియా 2025లో భారత మార్కెట్లోకి అప్‌డేట్ చేయబడిన ఆస్టర్‌ను తీసుకురావచ్చు. ఇది మారుతి సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి వాటికి కొత్త ఆస్టల్ పోటీని ఇవ్వబోతోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో హైబ్రిడ్ మోడల్ కార్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కారు రాబోతోంది. దీని ధర సుమారు రూ.20 లక్షలు(ఎక్స్-షోరూం) ఉండొచ్చు.