-
UP: పెళ్లైన ఆరు రోజులకే ఘోరం.. అందుకు ఒప్పుకోలేదని..
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలోని అమౌలి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. 44 ఏళ్ల వ్యక్తి రాజు పాల్ వివాహం అయిన ఆరు రోజుల తర్వాత తన భార్యను కొట్టి చంపాడు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై భారత శిక్షాస్మృతి (IPC)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు. […] -
USA: కాలిఫోర్నియాలోని ఆసుపత్రి సమీపంలో బాంబు పేలుడు.. ఒకరు మృతి
అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఒక సంతానోత్పత్తి క్లినిక్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొంది. ఈ పేలుడులో ఒకరు మరణించగా, దాదాపు నలుగురు గాయపడ్డారు. ఇది ఉద్దేశపూర్వక ఉగ్రవాద చర్య అని FBI చెబుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని FBI లాస్ ఏంజిల్స్ ఫీల్డ్ ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్ అకిల్ డేవిస్ తెలిపారు. Also Read:Tirupati Laddu Case: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి […] -
Tirupati Laddu Case: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో కదులుతున్న డొంక.. పలువురు ఉద్యోగులకు నోటీసులు
తిరుమల లడ్డూ ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో టీటీడీ ఉద్యోగుల అవినీతిపై దృష్టి సారించింది సిట్. ఈ క్రమంలో తిరుమల లడ్డు నెయ్యి కేసులో డొంక కదులుతోంది. సిట్ ఇప్పటికీ చార్జ్ షీట్ వేసింది. భోలేబాబా డెయిరీ కేంద్రంగా దర్యాప్తు చేస్తోంది.. తాజాగా టీటీడీలో జరిగిన అంశాలపై దర్యాప్తు ప్రారంభమైంది. Also Read:Telegram Global Contest: కంటెంట్ క్రియేటర్ల […] -
Annamaya District: పీలేరులో అదుపుతప్పి బావిలో పడ్డ కారు.. ముగ్గురు మృతి
అన్నమయ్య జిల్లాలోని పీలేరు సదుం రోడ్డులో ఘోర విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఈ ఘటనలో కర్ణాటక కు చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆదివారం ఉదయం వెలుగు చూసిన ఈ విషాదకర ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లి పడడంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. స్థానికులు కారును బావిలోంచి బయటకు తీశారు. మృతులు ఎవరన్నది తెలియ […] -
Chennai: సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్ల కలకలం.. స్నేహితుడైన ఓ ఖైదీ కోసం గంజాయి ఇవ్వడానికి వెళ్ళి..
చెన్నై సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్లు కలకలం సృష్టించాయి. సేలం సెంట్రల్ జైలులో ఉన్న స్నేహితుడైన ఓ ఖైదీకి గంజాయి ఇవ్వడానికి వెళ్లాడు ఓ యువకుడు. బిస్కెట్ల ఫ్యాకేట్ ఓపెన్ చేసి ఉండటంతో అనుమానం వచ్చి తనిఖీ చేశారు జైలు సిబ్బంది. బిస్కె్ట్లలో గంజాయి తరలించడాన్ని చూసి షాక్ కు గురయ్యారు. బిస్కెట్లకు రంధ్రం చేసి వాటిలో గంజాయి పెట్టి తీసుకొచ్చాడు ఆ యువకుడు. బిస్కెట్ ప్యాకెట్లో దాచిన 80 గ్రాముల గంజాయి స్వాదీనం చేసుకున్నారు పోలీసులు. […] -
Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం..
అరుణాచల్ ప్రదేశ్‌లోని దిబాంగ్ లోయలో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం భూకంపం గురించి నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ సమాచారం ఇచ్చింది. జాతీయ భూకంప కేంద్రం ప్రకారం, ఉదయం 5:06 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా అరుణాచల్ ప్రదేశ్‌లో ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించ లేదు. భూకంపం కారణంగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తీవ్రత తక్కువగా ఉండడంతో పెనుప్రమాదం తప్పనట్లైంది. Also Read:Nara […] -
PSLV C61: పీఎస్ఎల్వీ – సి61 ప్రయోగం విఫలం.. నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే..
ఆదివారం ఉదయం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 101వ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టింది. తాజా భూమి పరిశీలన ఉపగ్రహ మిషన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 5:59 గంటలకు PSLV-C61 రాకెట్ ప్రయోగించిన తర్వాత EOS-09 మిషన్ పూర్తికాలేదని ఇస్రో (ISRO) ధృవీకరించింది. ఫలితాన్ని ఉద్దేశించి ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ఇలా అన్నారు.. “EOS-09 మిషన్ పూర్తికాలేదు.” “మేము విశ్లేషణ […] -
Suzuki Access: కొత్త లుక్‌లో సుజుకి యాక్సెస్ విడుదల.. ధర ఎంతంటే?
సుజుకి మోటార్‌సైకిల్ తన అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్, కొత్త సుజుకి యాక్సెస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త యాక్సెస్ పేరు సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ TFT ఎడిషన్. ఇందులో అనేక కొత్త ఫీచర్లను చేర్చడంతో పాటు, లుక్‌లో కూడా స్వల్ప మార్పులు చేశారు. సుజుకి రైడ్ కనెక్ట్‌తో కూడిన పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో 4.2-అంగుళాల కలర్ థిన్-ఫిల్మ్ ట్రాన్సిస్టర్ (TFT) డిస్ప్లేను కలిగి ఉంది. ఇది రైడర్‌కు అవసరమైన సమాచారాన్ని […] -
Centre All Party Delegation: అఖిలపక్ష ప్రతినిధి బృందంలో శశి థరూర్.. కాంగ్రెస్ చెప్పిన నలుగురిని కాదని..
ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, ఈ అంశంపై భారత్ వైఖరిని వివరించడానికి కీలకమైన విదేశీ దేశాలను సందర్శించడానికి భారత ప్రభుత్వం ఏడుగురు సభ్యుల అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ కూడా ఉన్నారు. తిరువనంతపురం నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన శశి థరూర్ ఈ అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇతర నామినేటెడ్ సభ్యులలో బిజెపి నాయకులు […] -
Gold Rates: గోల్డ్ లవర్స్ కు బిగ్ రిలీఫ్.. నేటి బంగారం ధరలు ఇవే
పసిడి ప్రియులకు నేటి బంగారం ధరలు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. నిన్న, మొన్న పెరుగుతూ తగ్గుతూ షాకిచ్చిన గోల్డ్ ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. పుత్తడి ధరల్లో ఇవాళ ఎలాంటి మార్పు లేదు. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9, 513, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,720 వద్ద ట్రేడ్ అవుతోంది. Also Read:Official […]
తాజావార్తలు
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!