గురువారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ చదవనున్నారు. ఈ బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. మద్యం కేసులో ఆయనకు ఇప్పటికే నాలుగు సార్లు నోటీసులు ఇచ్చింది. తాజాగా మళ్లీ ఐదోసారి సమన్లు పంపించింది. ఫిబ్రవరి 2 విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.