Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మళ్లీ ఈడీ సమన్లు.. ఎల్లుండి రావాలని నోటీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. మద్యం కేసులో ఆయనకు ఇప్పటికే నాలుగు సార్లు నోటీసులు ఇచ్చింది. తాజాగా మళ్లీ ఐదోసారి సమన్లు పంపించింది. ఫిబ్రవరి 2 విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఆయా కారణాలతో పలుమార్లు కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. ఈసారి మాత్రం విచారణకు హాజరుకాకపోతే ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు ఆప్‌ను బలహీనపర్చేందుకే కేంద్రం ఈడీని పావుగా వాడుకుంటోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే లిక్కర్ స్కామ్‌లో నాలుగు సార్లు నోటీసులు ఇచ్చింది. గత నవంబర్ 2న, ఆ తర్వాత డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 13న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ఇచ్చింది. తాజాగా మరోసారి శుక్రవారం విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే నాలుగు సార్లు విచారణకు డుమ్మాకొట్టారు. ఈసారి హాజరుకాకపోతే మాత్రం అరెస్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
ఇది కూడా చదవండి: Breaking: జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పూజలు చేసేందుకు హిందువులకు కోర్టు అనుమతి
లిక్కర్ కేసులో గత ఏప్రిల్‌లో దాదాపు 9 గంటల పాటు కేజ్రీవాల్‌ను విచారించింది. కానీ నిందితుడిగా మాత్రం చేర్చలేదు. కానీ ఇదే కేసులో ఆప్ ముఖ్య నేతలు ఎంపీ సంజయ్‌సింగ్, మాజీ మంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. గతేడాది ఫిబ్రవరిలో సిసోడియా, అక్టోబర్‌లో సంజయ్‌సింగ్ అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. పలుమార్లు బెయిల్ పిటిషన్లు కూడా రద్దు కావడంతో ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ వెంటాడుతోంది. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోపు ఆప్ పార్టీని బలహీనపర్చాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈడీని వాడుకుంటుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా భూకుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. బుధవారం ఈడీ ముందు హేమంత్ హాజరయ్యారు. విచారణ అనంతరం సోరెన్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు విపక్షాలను ఇరుకున పెట్టేందుకు బీజేపీ భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!