-
Milk Price Hike: పండుగ సీజన్‌కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
Milk Price Hike: పండుగ సీజన్‌కు ముందు ముంబై వాసులకు పాల ధరల పెంపు షాక్ తగలనుంది. సెప్టెంబర్ 1, 2026 నుంచి నగరంలో బాటిళ్లు/డెయిరీల ద్వారా విక్రయించే పాలు లీటరుకు రూ.9 పెరగనున్నాయి. ప్రస్తుతం లీటరు రూ.93గా ఉన్న డెయిరీ పాల ధర ఇకపై రూ.102కు చేరనుంది. అయితే ఈ ధరల పెంపు ప్యాకేజ్డ్ పాలకు వర్తించదు. ప్రధానంగా బహిరంగ పాల దుకాణాలు, డెయిరీల నుంచి కొనుగోలు చేసే పాల ధరపైనే ప్రభావం పడనుంది. దీంతో […] -
PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
PG Doctors New Rules: పీజీ వైద్య విద్యార్థుల విధులు, సెలవులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పీజీ వైద్యులను 24 గంటలకు మించి వరుసగా డ్యూటీ చేయించకూడదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ విష్ణువర్ధన్ స్పష్టం చేశారు. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. నైట్ డ్యూటీ చేసిన పీజీ వైద్యులకు మరుసటి రోజు తప్పనిసరిగా […] -
AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
AP Municipal Law Amendment: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ పాలనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఏపీ మున్సిపల్ లా సవరణ చట్టానికి గవర్నర్ ఆమోదం లభించింది. ఈ సవరణలతో స్థానిక సంస్థల పాలనలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. సవరించిన చట్టం ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ పదవుల సంఖ్యను రెండింటి నుంచి ఒకటికి తగ్గించారు. అలాగే మున్సిపాలిటీల్లో ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్ పదవులను కూడా రెండింటి నుంచి […] -
Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold and Silver Today: వరుసగా పెరుగుతూ సామాన్యులతో పాటు.. మధ్యతరగతి ప్రజలకు కూడా అందని ద్రాక్షలా మరుతోన్న బంగారం ధరలు.. ఇప్పుడు మళ్లీ తగ్గుముఖం పట్టాయి.. ఈ రోజు బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాములపై రూ.2,890 తగ్గి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,240కి దిగివచ్చింది.. ఇక, రూ.2,650 తగ్గి రూ.1,45,050కి చేరుకుంది 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. 18 క్యారెట్ల బంగారం […] -
Suryakumar Yadav: కెప్టెన్‌గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ఆ తర్వాత జట్టు నుంచి తనను తప్పించడంపై తొలిసారి బహిరంగంగా స్పందించాడు. సెలెక్టర్ల నిర్ణయం తనను తీవ్రంగా నిరాశకు గురిచేసిందని, అసలు “ఇది ఎలా సాధ్యం?” అనే ప్రశ్న తనను కొంతకాలం వెంటాడిందని సూర్యకుమార్ వెల్లడించాడు. 2024 జూలైలో భారత టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్.. తన నాయకత్వంలో ఒక్క టీ20 సిరీస్‌లో కూడా ఓటమి చవిచూడలేదు. […] -
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
Mallikarjun Kharge: నేపాల్‌లో సంభవించిన విధ్వంసకర వరదలపై కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు. నేపాల్‌లో భారీ వరదల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని ఖర్గే పేర్కొన్నారు. వరదల కారణంగా 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 1,000 మందికి పైగా గల్లంతైనట్లు ఖర్గే […] -
US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
US-Venezuela Oil Deal: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులాతో భారీ చమురు ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో.. ఈ ఒప్పందం ద్వారా వెనిజులాలోని 65 బిలియన్ బ్యారెళ్లకు పైగా నిర్ధారిత చమురు నిల్వలపై అమెరికాకు మెజారిటీ నియంత్రణ లభించనుందని తెలిపారు. దీనిని ‘‘ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద చమురు ఒప్పందం’’గా ట్రంప్ అభివర్ణించారు. ట్రంప్ ప్రకారం.. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, […] -
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
Janasena Party: ఆంధ్రప్రదేశ్‌లో స్థానికల ఎన్నికల హడావిడి మొదలైంది.. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ కార్యాచరణకు సిద్ధమవుతోంది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు స్థానిక ఎన్నికల వ్యూహం, కార్యాచరణపై చర్చించారు. 30 రోజుల పాటు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రత్యేక ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల వ్యూహం ఎలా ఉండాలనే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ […] -
Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
Vizag Tragedy: రాఖీ పండుగ రోజున విశాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆటో డ్రైవర్ తన భార్య, ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. మృతుడిని మల్ల ప్రవీణ్ కుమార్‌గా గుర్తించారు. ఆయన స్వస్థలం కొత్తవలస కాగా, జీవనోపాధి కోసం పెందుర్తిలోని ఓ అద్దె ఇంట్లో భార్య, ఇద్దరు చిన్నారులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ప్రవీణ్ కుమార్ ఆటో […] -
Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదురాంతగం సమీపంలో ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పుదుచ్చేరి టూర్ ముగించుకుని చెన్నైకి తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా వెనుక టైరు పేలడంతో వాహనం అదుపుతప్పినట్లు సమాచారం. దీంతో కారు పలుమార్లు పల్టీలు కొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు […]
తాజావార్తలు
-
Pawan Kalyan – Dil Raju: మళ్లీ సెట్ కాబోతున్న ‘వకీల్ సాబ్’ కాంబో.. దిల్ రాజు ఇంట్రెస్టింగ్ హింట్!
-
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు ఎంతో అనుకూలం
-
UP Elections 2027: యూపీలో బీజేపీదే పైచేయి.. సీఎంగా యోగికే మద్దతు.. లేటెస్ట్ సర్వేలో కీలక విషయాలు..
-
Assam: అస్సాంలో ఘోర ప్రమాదం.. ట్రక్కు–మినీ బస్సు ఢీ, 23 మంది మృతి!
-
Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై కొత్త బజ్.. జక్కన్న కన్ను ఆ స్లాట్పైనేనా?
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?