Sampath Kumar
Author- NTV Telugu-
Somireddy Chandra Mohan Reddy: 13వ తేదీ అయిపోయింది.. జూన్ 4వ తేదీ మిగిలే ఉంది!
13వ తేదీ అయిపోయిందని, జూన్ 4వ తేదీ మిగిలే ఉందని వైసీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ వేశారు. జూన్ 4వ తేదీన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూడండన్నారు. ఏపీలో తాము అధికారంలోకి రాబోతున్నామని, కడపలో మెజార్టీ సీట్లు టీడీపీకి రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు కంట్రోల్లో ఉండాలని, ఓ చెంప మీద కొడితే.. రెండో చెంప చూపడానికి తామేం గాంధీ మహాత్ములం కాదని సోమిరెడ్డి హెచ్చరించారు. […] -
Turtles Seized: అక్రమంగా తరలిస్తున్న 1600 తాబేళ్ల పట్టివేత!
Illegal Turtles Transportation in Alluri Sitharama Raju District: ఏపీలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అల్లూరిజిల్లా రంపచోడవరం మండలం ఫోక్స్‌పేట అటవీ చెక్‌పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1589 తాబేళ్లను కోనసీమ జిల్లా రామచంద్రపురం నుండి ఏజెన్సీ మీదుగా ఒడిశాకు అక్రమంగా మినీ వ్యాన్‌లో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫోక్స్ పేట అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద […] -
MLA Srikanth Reddy: బీసీ నేత వెంకటేశ్వర్లు ఇంటిపై టీడీపీ దాడి చేయడం హేయమైన చర్య!
రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై టీడీపీ దాడి చేయడం హేయమైన చర్య అని సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నేతలను టీడీపీ టార్గెట్ చేసిందన్నారు. పోలింగ్ రోజే బీసీ నేత అయిన వెంకటేశ్వర్లను టీడీపీ నేతలు దూషించడం బాధాకరం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి కొనసాగితే.. గట్టిగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి […] -
Road Accident: ప్రకాశం జిల్లాలో బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు!
Prakasam Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది.. క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పేలకుర్తి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. 25 మంది భక్తులు బుధవారం […] -
Srisalam 1Town PS: శ్రీశైలం వన్‌టౌన్ పీఎస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య!
Constable Suicide in Srisalam: నంద్యాల జిల్లా శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. పీఎస్‌లో పిస్టల్‌తో కాల్చుకొని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెంట్రీ డ్యూటీలో ఉన్న శంకర్ రెడ్డి అనే కానిస్టేబుల్.. బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్‌స్టేషన్ విశ్రాంతి గదిలోనే అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న సీఐ ప్రసాద్ రావు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. శంకర్ రెడ్డి 2000 సంవత్సరం బ్యాచ్‌కి చెందిన వాడు. ఆత్మహత్యకు కుటుంబ […] -
Top Headlines @ 9 AM : టాప్ న్యూస్!
తేరుకుంటున్న పల్నాడు: రాజకీయ ఘర్షణలతో గత మూడు రోజులుగా అట్టుడుకుతున్న పల్నాడు జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను అదుపులోకి తెస్తున్నారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం రాత్రి నుంచే మాచర్లలోనే మకాం వేయడంతో పాటు అదనపు బలగాలను మోహరింపజేసి.. పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. శాంతిభద్రతలు ఒకింత అదుపులోకి రావడంతో పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే చిరు వ్యాపారాలు తెరుచుకుంటున్నాయి. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకూ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని […] -
AP Elections 2024: టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు!
TDP Leaders House Arrest in Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసీపీ నేతల ఇండ్లపై జరిగిన దాడులపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలలో భాగంగా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. చిన్నమండెం మండలం పడమటికోన గ్రామం బోరెడ్డిగారిపల్లెలో రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. Also Read: Palnadu: తేరుకుంటున్న పల్నాడు.. తెరుచుకుంటున్న చిరు వ్యాపారాలు! వైసీపీ నేత […] -
Palnadu: తేరుకుంటున్న పల్నాడు.. తెరుచుకుంటున్న చిరు వ్యాపారాలు!
144 Section in Palnadu: రాజకీయ ఘర్షణలతో గత మూడు రోజులుగా అట్టుడుకుతున్న పల్నాడు జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను అదుపులోకి తెస్తున్నారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం రాత్రి నుంచే మాచర్లలోనే మకాం వేయడంతో పాటు అదనపు బలగాలను మోహరింపజేసి.. పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. శాంతిభద్రతలు ఒకింత అదుపులోకి రావడంతో పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే చిరు వ్యాపారాలు తెరుచుకుంటున్నాయి. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకూ 144 సెక్షన్ […] -
AP EAPCET: నేటి నుంచే ఏపీ ఈఏపీసెట్.. నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ!
AP EAPCET Starts From Today: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే.. ఏపీ ఈఏపీసెట్ గురువారం నుంచి ప్రారంభమవుతుంది. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. అభ్యర్థులు గోరింటాకు పెట్టుకుంటే బయోమెట్రిక్‌కు ఇబ్బందులు రావొచ్చని పేర్కొన్నారు. అభరణాలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలనూ పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోరని ఆయన తెలిపారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ… ‘ఏపీ ఈఏపీసెట్ ఈ నెల 16 నుంచి […] -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
నేడు మహారాష్ట్రకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. కొల్హాపూర్‌లోని శ్రీ మహాలక్షి ఆలయాన్ని బాబు సందర్శించనున్నారు. మధ్యాహ్నం షిరిడీ సాయిబాబాను దర్శించుకొనున్నారు. నేడు ఢిల్లీకి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెళ్లనున్నారు. రాష్ట్రంలో హింసను కంట్రోల్ చేసేందుకు తీసుకున్న చర్యలపై సీఈసీకి వివరణ ఇవ్వనున్నారు. నేటి నుంచి ఏపీ ఈఏపీఎస్ ప్రారంభం కానుంది. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ గురువారం నుంచి ప్రారంభమవుతుందని […]
తాజావార్తలు
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
-
Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే…!
-
Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..