వైసీపీ అధినేత జగన్ నేడు బెంగళూరు నుంచి రానున్నారు. ఆయన గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి రైజ్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ ప్రత్యర్ధుల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తను పరామర్శించనున్నారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఎల్లుండి నంద్యాల వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నంద్యాల వెళ్లి అక్కడ హత్యకు గురైన వైసీపీ నేత సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. నేటి నుంచి జగన్ క్యాంప్ ఆఫీస్ లో వైసీపీ కార్యాలయం […]
నేటి నుంచి జగన్ క్యాంప్ ఆఫీస్‌లో వైసీపీ కార్యాలయం. ఇప్పటివరకు తాడేపల్లిలో నడిచిన వైసీపీ కేంద్ర కార్యాలయం. కొత్త ఆఫీస్ నుంచే నేటి నుంచి వైసీపీ కార్యకలాపాలు. పారిస్ ఒలింపిక్స్‌లో నేడు సెమీఫైనల్ ఆడనున్న భారత హాకీ జట్టు. ఈ రోజు రాత్రి 10.30 గంటలకు హాకీ సెమీ ఫైనల్. జర్మనీతో తలపడనున్న భారత హాకీ జట్టు. తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,570 లుగా ఉండగా.. 22 క్యారెట్ల […]
ఆ నియోజకవర్గంలో రాజకీయం యమా రంజుగా మారుతోందట. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య యుద్ధం టామ్ అండ్ జెర్రీని తలపిస్తోందట. తగ్గేదే లే అన్నట్టుగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో రక్తి కట్టిస్తున్నారు. ఛాన్స్ దొరికితే చట్రంలో ఇరికించే ప్రయత్నం జరుగుతున్న ఆ నియోజకవర్గం ఏది? ఎవరా ఇద్దరు నేతలు? శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారుతున్నాయి. సవాళ్ళు సెగలు రేపుతున్నాయి. ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి సీదిరి […]
ప్రపంచ స్థాయిలో ఐటి రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఇరవై వేల మంది ఉద్యోగులుండేలా పది లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్ ను స్థాపించనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ […]
వైసీపీకి చెందిన ఆ రాజ్యసభ్యుడు టీడీపీలోకి జంప్ కొట్టేస్తారా? టీడీపీ గాలం ఆల్రెడీ ఆయనకు టచ్ అయిందా? పైకి ఆయన లేదు లేదంటున్నా…. ప్రచారం మాత్రం ఆగడం లేదు ఎందుకు? ఊ.. అంటావా…ఉఊ.. అంటావా అంటూ టీడీపీ ఎదురు చూస్తోందన్నది నిజమేనా? ఇంతకీ ఎవరా ఎంపీ? వెనకున్న కథేంటి? పిల్లి సుభాష్‌చంద్రబోస్…. వైసీపీకి వీర విధేయుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ పార్టీకి ఏకైక రాజ్యసభ సభ్యుడు. ఇప్పుడాయనకు టీడీపీ గాలం వేస్తోందన్న ప్రచారం కలకలం రేపుతోంది. […]
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు నెలల్లో వివిధ సైబర్ మోసాల బాధితులకు రూ.85.05 కోట్లు తిరిగి అందించింది. TGCSB డైరెక్టర్ శిఖా గోయెల్ మాట్లాడుతూ TGCSB , తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (TGLSA) మధ్య సహకార ప్రయత్నమే ఫలితం అని అన్నారు. ఈ ప్రయత్నాలు పెరుగుతున్న సైబర్ నేరాల వెనుక గల కారణాలను , నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) ద్వారా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ […]
పార్టీ మారిన, మారాలనుకుంటున్న ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ వైఖరి మారిందా? బతిమాలుకోవడాల ప్లేస్‌లోకి ఒక రకమైన బెదిరింపులు వచ్చేశాయా? డైరెక్ట్ వార్నింగ్స్ కాకుండా… కోర్ట్ తీర్పులు, రూల్స్ అంటూ జంపింగ్ జపాంగ్స్ ముందరి కాళ్ళకు బంధాలు వేయాలనుకుంటున్నారా? అలాంటివి ఎంతవరకు పనిచేసే అవకాశం ఉంది? సుప్రీంకోర్టు తీర్పును పదే పదే ప్రస్తావిస్తూ… సోషల్ మీడియా ప్రచారం చేయడం వెనకున్న ఉద్దేశ్యం ఏంటి? అవును బ్రదర్… మేం ఫిరాయింపుల్ని ప్రోత్సహించాం. అప్పట్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని లాక్కున్నాం. అయితే ఏంటి… […]
బంగ్లాదేశ్ ప్రధాని తండ్రి షేక్ ముజ్బిర్ రెహ్మాన్ విగ్రహం ధ్వంసం..! బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, షేక్ హసీనా తండ్రి.. షేక్ ముజ్బిర్ రెహ్మాన్ విగ్రహాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వేల సంఖ్యలో యువత రోడ్ల మీదకు వచ్చిన పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. దేశ రాజధాని ఢాకాలో ఉన్న ప్రధాని ప్యాలెస్‌లోకి ప్రవేశించడంతో పాటు అక్కడ ఉన్న వస్తువులను పూర్తిగా నాశనం చేశారు. అలాగే, ఢాకా వీధుల్లో జెండాలతో […]
జీవన్‌దాన్‌లో జాతీయస్థాయిలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైన సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందనలు తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో అవయవదానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు 14వ ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే (03.08.2024) సందర్భంగా జాతీయస్థాయిలో దేశ రాజధాని న్యూఢిల్లీలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో నిర్వహించిన కార్యక్రమంలో […]
ఏడాది పొడవునా క్రాప్ హాలిడేను ముగించడంతోపాటు, 26 క్రెస్ట్ గేట్లలో 14 తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ (6.3 లక్షల ఎకరాలు), ఆంధ్రప్రదేశ్ (11.74 లక్షల ఎకరాలు)లో విస్తరించి ఉన్న 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు తీవ్ర కొరత ఏర్పడింది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్ఎస్పి) ఎత్తివేతతో సోమవారం డ్యామ్ నుండి వరద ప్రవాహాన్ని విడుదల చేశారు. ప్రాజెక్ట్ దాని రెండు ప్రధాన కాలువలతో సహా అన్ని అవుట్లెట్ల నుండి కలిపి 2 లక్షల క్యూసెక్కులకు పైగా ఔట్ […]