షేక్ హసీనా, రెహానాలను అరెస్టు చేయండి.. భారత్‌కు బంగ్లాదేశ్ ఎస్సీబీఏ వినతి..! బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా, ఆమె సోదరి షేక్ రెహానాలను అరెస్టు చేసి తమ దేశానికి పంపించాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ భారత్‌ను కోరారు. ఎస్సీబీఏ ఆడిటోరియంలో తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. బంగ్లాలో హసీనా అనేక మరణాలకు బాధ్యురాలని ఆరోపణలు చేశారు. అలాంటి వారితో సానుకూల సంబంధాలు […]
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చేనేత రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల చేనేతను గుర్తించి ప్రయోజనకరమైన పథకాలను కొనసాగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు కోరారు. చేనేత కార్మికులకు మేలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగించాలని, చేనేత పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం చేనేత రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని, దేశ చరిత్రలో […]
చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పీపుల్స్ ప్లాజా వద్ద చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. చేనేత రంగం మన దేశపు పురాతన సంపద, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. చేనేత రంగంలో నిపుణులైన మన చేనేత కార్మికుల అంకితభావం, సృజనాత్మకత దేశానికి గర్వకారణమని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి […]
హైదరాబాద్ నగరంలో న్యూస్ ఛానల్ నడుపుతున్న యూట్యూబర్‌కు ఓ రౌడీ షీటర్ కత్తితో రక్తపు గాయం చేశాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి మైలార్‌దేవ్‌పల్లిలో చోటుచేసుకుంది. వట్టెపల్లికి చెందిన బాధితుడు ముబీన్ మీర్జా, మహమూదా హోటల్ సమీపంలో నిలబడి ఉండగా, రౌడీ షీటర్ సోహైల్ , అతని సహచరులు వచ్చి అకస్మాత్తుగా బాధితుడి ముఖంపై కత్తితో దాడి చేశారు. క్షతగాత్రుడిని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి […]
రక్షణ పరిశోధన బృందం అభివృద్ధి చేసిన కొత్త సాంకేతికత ఇప్పుడు తిరుపతి లడ్డూ ప్రసాదం కోసం పర్యావరణ అనుకూలమైన , స్థిరమైన సంచులను అందించనుంది. డాక్టర్ కె వీరబ్రహ్మం, శాస్త్రవేత్త , డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లోని అతని బృందం PBAT, పెట్రోలియం ఉత్పత్తులు లేదా మొక్కల నూనెల నుండి తీసుకోబడిన బయోడిగ్రేడబుల్ పాలిమర్‌ను అభివృద్ధి చేసింది, ఇప్పుడు లడ్డూ ప్రసాదం పంపిణీకి ఉపయోగించబడుతుంది. ఈ సాంకేతికతను ఇప్పటికే 40 పరిశ్రమలకు ఉచితంగా బదిలీ […]
నేడు ఆదిలాబాద్ జిల్లాకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రానున్నారు. పాదయాత్ర ప్రారంభించిన ఊరు పిప్పిరిలో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు పిప్పిరి గ్రామానికి డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క చేరుకోనున్నారు. అధికారులతో జిల్లా అభివృద్ది పురోగతి, అమలవుతున్న పథకాలు, సంక్షేమం గురించి సమీక్షిస్తారని, ఆ తరువాత ఎస్టీఎస్‌డిఎఫ్ రూ.15 కోట్లతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.2 కోట్లతో వాంకిడి సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. రూ.3.5 కోట్లతో పిప్పిరి […]
నేటి నుంచి అమరావతిలో ముళ్ల కంపలు, తుమ్మ చెట్ల తొలగింపు ప్రారంభం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులకు తొలి అడుగు పడబోతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో వివక్షకు గురైన అమరావతి రాజధానిని మళ్లీ గాడిన పెట్టేందుకు వీలుగా టీడీపీ సర్కార్ తీసుకున్న చర్యలలో భాగంగా ఇవాళ (బుధవారం) తొలి అడుగుగా కంప చెట్లు, పిచ్చి చెట్లు, తుమ్మ చెట్ల తొలగింపు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. అమరావతి రాజధాని అంతా గత ఐదేళ్ల వైసీపీ […]
హెల్త్‌కేర్‌లో ప్రపంచంలో పేరొందిన హెచ్‌సీఏ హెల్త్‌కేర్ హైదరాబాద్ లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది మార్చిలో ఇంక్యుబేషన్ ఫెసిలిటీని ప్రారంభించిన ఈ సంస్థ తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. తెలంగాణలో ఏర్పాటు చేసే కొత్త క్యాంపస్ కు నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. అమెరికా పర్యటనలో హెచ్‌సిఎ హెల్త్‌కేర్‌కు చెందిన ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుతో చర్చలు […]
NTV Daily Astrology As on 07th Aug 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి…? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న భేటీ. రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం. నిర్మాణాలపై ఇప్పటికే నివేదిక ఇచ్చిన ఐఐటీ నిపుణులు. తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావారణ శాఖ. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లాలకు భారీ వర్ష సూచన. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు […]