Gogikar Sai Krishna
Author- NTV Telugu-
సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిపోయిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు..
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వెళ్లిన వారు తిరిగి తమ సొంతూరు చేరుకుంటారు. సంక్రాంతి పండుగ రోజున బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా గడుపుతుంటారు. ఈ నేపథ్యంలో సొంతూరు వెళ్లావారితో హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. ఎక్కడా చూసిన ప్రయాణికుల రద్దీగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కనిపిస్తున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ భారీ ఉంది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతో పాటు సొంత వాహనాల్లో జనాలు సొంతూళ్లకు […] -
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు..
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వైకుంట ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి భారీ భక్తులు విచ్చేశారు. రాజకీయ, సీని ప్రముఖులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 1.45 గంటలకే స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. అయితే 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వారా దర్శనం కొనసాగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇటు తెలంగాణలో సైతం ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా ఉంది. వేకువజామునుంచే స్వామి […] -
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
నేడు ఉద్యోగుల హెచ్ఆర్ఏపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. స్పష్టత రాకుంటే కార్యాచరణపై భేటీ కావాలని జేఏసీల ఐక్య వేదిక భావిస్తోంది. నేడు కోవిడ్ పరిస్థితులు, వాక్సినేషన్‌పై ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను కమిటీ ఖరారు చేయనుంది. నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా […] -
ఏపీలో సినిమా టికెట్ ధరల వివాదంపై స్పందించిన బాలకృష్ణ
ఇటీవల నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ. ఈ సినిమా అఖండ విజయాన్ని సొంత చేసుకుంది. ఈ నేపథ్యంలో అఖండ చిత్రయూనిట్ థాంక్స్ మీట్‌ను నిర్వహించాయి. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… అన్ సీజన్ లో అఖండ విడుదల చేశామని, అఖండ పాన్ ఇండియా సినిమానే కాదు పాన్ వరల్డ్ సినిమాగా మారిందని ఆయన అన్నారు. పాకిస్థాన్‌లో కూడా అఖండ చెలరేగిపోతుందని, అక్కడి నుంచి వాట్సప్ వీడియోలు వస్తున్నాయన్నారు. అంతేకాకుండా ఏపీలో […] -
బలిసి కొట్టుకుంటోంది మీరే : ఎన్వీ ప్రసాద్
ఇటీవల ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. కొవ్వూరులో ప్రసన్న కూమార్ రెడ్డి అంటే ఏంటో అందరికి తెలుసునని, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబం అంటే చాలా గౌరవం ఉందని ఆయన అన్నారు. అనవసరపు వ్యాఖ్యలతో గౌరవాన్ని దిగజార్చుకోవద్దని, వంద అడుగులు పైనుంచి రోప్ కట్టుకొని కిందకు దూకితే ఎవరు బలిసి […] -
కరోనా నువ్వు తగ్గవా.. ఐఐటీ హైదరాబాద్‌లో 119 మంది విద్యార్థులకు పాజిటివ్..
కరోనా మహమ్మారి విజృంభన రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. కాలేజీల్లో, ఆఫీసుల్లో, పాఠశాలల్లో ఆఖరికి ఆసుపత్రుల్లోని వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇలా ఎక్కడా చూసినా కరోనా రక్కసి రెక్కలు చాస్తోంది. అయితే థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను తీవ్రతరం చేస్తున్నాయి. అయినప్పటికీ కరోనా కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. తాజాగా ఐఐటీ హైదరాబాద్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఐఐటీ హైదరాబాద్‌లోని విద్యార్థులకు […] -
బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేకి : సీఎం కేసీఆర్
రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేకి అని ఆయన అన్నారు. దేశంలో రైతులను బీజేపీ బతకనిచ్చేలా లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎరువుల ధరలు పెంచుతూ.. రైతుల ఆదాయం పెంచుతామన్న కేంద్రం ఖర్చులు రెట్టింపు చేసిందని కేసీఆర్ విమర్శించారు. ఎరువుల ధరలు తగ్గించేంతవరకు పోరాటం చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. కరెంట్ మోటర్లతో బిల్లులు వసూలు చేయడం, ధాన్యం కొనకుండా ఎరువుల […] -
ఎస్బీఐ యోనో కస్టమర్ కేర్ పేరుతో 9 లక్షలు స్వాహా..
సందు దొరికితే చాలు.. సైబర్ నేరగాళ్లు ఇదే అదునుగా భావించి డబ్బులు దండుకుంటున్నారు. సైబర్ నేరాలపై అవగాహన లేని కొందరు ఆన్లైన్లో కస్టమర్ కేర్ నంబర్లను సర్చ్ చేస్తూ.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన వెంకట లక్ష్మీ అనే మహిళకు ఎస్బీఐలో అకౌంట్ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఎస్బీఐ యోనో యాప్‌ను వినియోగిస్తుంటుంది. అయితే ఇటీవల ఆమె ఫోన్లో ఎస్బీఐ యోనో యాప్ పనిచేయకపోవడంతో కస్టమర్ కేర్‌ను సంప్రదించింది. […] -
టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించబోతోంది : మంత్రి సత్యవతి
హైదరాబాదులో కోట్ల రూపాయల భూమిని ఇచ్చి ఇరవై అయిదు కోట్ల రూపాయల వ్యయంతో గిరిజన కొమురంభీమ్ భవనాన్ని నిర్మిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం ఆమె నిర్మల్ జిల్లాలో మాట్లాడుతూ.. గిరిజన బిడ్డలు కోరుకున్న గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసామని, గిరిజనులు, పేదలను ఇన్ని రోజులు ఓట్ల సాధనాలుగానే చూశారని ఆమె వ్యాఖ్యానించారు. ఉద్యమ కాలంలో అరవై అయిదు సీట్లు ఇస్తే, అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎనభై అయిదు సీట్లను కట్టబెట్టే […] -
కేంద్రం సీరియస్‌గా ఉంది.. ఎప్పుడైనా కేసీఆర్ జైలుకు వెళ్ళొచ్చు : బండి
మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, ఈ విషయములో కేంద్రం సీరియస్‌గా ఉందన్నారు. కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్దమైందని, ఎప్పుడైనా కేసీఆర్ జైలుకి వెళ్ళొచ్చన్నారు. అంతేకాకుండా ఈ విషయం కేసీఆర్ కు తెల్సి పోయిందని, అందుకే కమ్యూనిస్టుల తోను, ఇతర పార్టీల నేతల తో భేటీ అవుతున్నాడని విమర్శించారు. తేజస్వి యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా పసుగ్రాసం కుంభకోణం కేసులో జైలుకు వెళ్లి […]
తాజావార్తలు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
Ameesha Patel: ‘ఆంటీ’ అంటూ ట్రోల్.. హార్దిక్‌తో లింకప్ రూమర్స్‌పై అమీషా స్ట్రాంగ్ కౌంటర్!
-
TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
-
Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!