Gogikar Sai Krishna
Author- NTV Telugu-
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
నేడు ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. సింగపూర్ షట్లర్ లోహ్ కీన్ యాతో భారత షట్లర్ లక్ష్యసేన్ తలపడనున్నాడు. నేడు తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై దర్శించుకోనున్నారు. ఇప్పటికే తిరుమలకు చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసైకి టీటీడీ అదనపు ఈవో ధర్మరెడ్డి స్వాగతం పలికారు. నేటి నుంచి కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. పట్నంవారంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. కరోనా దృష్ట్యా అంతర్గతంగా అగ్నిగుండాలు, పెద్దపట్నం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో నేడు, రేపు పలు ఎంఎంటీఎస్ […] -
ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన టీచర్స్
తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు జీవో 317ను రద్దు చేయాలని కోరుతూ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. తాజాగా ప్రగతి భవన్‌ను ముట్టడికి టీచర్స్ యత్నించారు. దీంతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు 70 మందికి పైగా టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట నుంచి ప్రగతి భవన్ వరకు పోలీసులు మోహరించారు. వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలిస్తున్నారు. అసంబద్దంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టారని, సీనియార్టీ ప్రకారం […] -
రివ్యూ : హీరో
సినీ, రాజకీయ కుటుంబాలతో అనుబంధం ఉన్న అశోక్ గల్లా హీరోగా అరంగేట్రం చేసిన సినిమా ‘హీరో’. ఇటు తాత కృష్ణ పేరు మోసిన స్టార్ హీరో, మేనమామ మహేశ్ బాబు ఈ నాటి మేటి హీరో. వీరి అండదండలతో పాటు, అటు తండ్రి గల్లా జయదేవ్, నాన్నమ్మ గల్లా అరుణకుమారి రాజకీయరంగంలో పేరొందినవారు. వీరి వారసుడు కాబట్టి అశోక్ గల్లా ‘హీరో’పై అందరి దృష్టి మళ్ళింది. అయితే సినిమా నిర్మాణంలో జరిగిన తీవ్ర జాప్యంతో దీనిపై జనాలకు […] -
భారతదేశం కోసం ఆవిష్కరణలు చేద్దాం : ప్రధాని మోడీ
ఈ రోజు ఉదయం 10.30 గంటలకు స్టార్టప్‌ల ప్రతినిధులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరు అంశాలపై స్టార్టప్ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. జనవరి 16ను జాతీయ అంకుర దినోత్సవంగా జరుపుకోవాలన్నారు. అంకుర సంస్థలు నవ భారతానికి వెన్నెముకగా మారనున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశంలో కోసం ఆవిష్కరణలు చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా భారతదేశం నుంచి ఆవిష్కరణలు చేద్దామన్నారు. దేశంలోని ప్రతి జిల్లాలోనూ అంకుర […] -
ఆలస్యంగా రానున్న అన్నయ్య.. ఆచార్య సినిమా వాయిదా..
మెగాస్టార్ కథనాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎప్పుడెప్పుడూ ఆచార్య సినిమా విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు నిరాశే మిగిలింది. కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలు వాయిదాపడ్డాయి. రామచరణ్, ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’, రెబల్‌స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ లాంటి పాన్ఇండియా సినిమాలు సైతం కరోనా దెబ్బకు యూటర్న్ […] -
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంపై ఈసీ కీలక సమావేశం
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవల ప్రకటించింది. 7 దశల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. అయితే కరోనా కేసులు దేశవ్యాప్తంగా భారీగా నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు నిర్వహించడం ఈసీకి సవాల్‌గా మారింది. అయితే ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నిల ప్రచారంపై ఈసీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర కార్యాలయంలో ముగ్గురు ఎన్నికల కమిషనర్లు సమావేశమయ్యారు. అంతేకాకుండా కరోనా […] -
ఎస్సార్‌పురంలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం..
ఏపీలో మరో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలోని ఎస్సార్‌పురంలో గుర్తు తెలియని దుండగులు వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే ఘటనా స్థలం వద్దకు వైసీపీ కార్యకర్తలు చేరుకొని ధర్నా చేపట్టారు. అంతేకాకుండా ఘటనస్థలాన్ని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ.. పోలీసులు డిప్యూటీ సీఎం నారాయణస్వామి అగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విగ్రహ ధ్వంసానికి […] -
తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు : గవర్నర్ తమిళిసై
సంక్రాంతి సందర్భంగా రాజ్ భవన్లో మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై దంపతులు, బంధువులు, రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు. సంప్రదాయ పద్దతిలో రాజ్ భవన్లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పొంగల్ తయారు చేశారు. అనంతరం గవర్నర్ తమిళసై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా ప్రోటోకాల్‌ను పాటిస్తూ పండుగ జరుపుకుందామని ఆమె పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన జాగ్రత్తలు […] -
బీజేపీ నేతలకు సవాల్ విసిరిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి..
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌లకు జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. తెలంగాణలోని పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తే.. మన దేశం అభివృద్ధిలో అమెరికాను దాటుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాల లాంటివి బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్నారా..? అని ఆయన ప్రశ్నించారు. […] -
సంక్రాంతి ఎఫెక్ట్ : బోసిపోయిన భాగ్యనగరం..
నిశీది వేళలో సైతం నిద్రించని భాగ్యనగరం ఇప్పడు బోసిపోయింది. సంక్రాంతి పండుగ వేళ.. పట్నంవాసులు పల్లెలకు పరుగులు తీశారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు మహానగరంలో ఉరుకుల పరుగుల జీవితాన్ని గడిపి.. సంక్రాంతి పండుగకు సొంతూళ్లో బంధుమిత్రులతో గడిపేందుకు ప్రజలు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రధాన రహదారులు వెలవెలబోతున్నాయి. ఎప్పడూ రద్దీగా ఉండే రోడ్లన్నీ నిర్మానుష్యంగా తయారయ్యాయి. అటు ఏపీకి చెందిన వారు ఆంధ్రాకు పయనమైతే.. ఇటు తెలంగాణలోని వారి సైతం తమ ఊర్లకు […]
తాజావార్తలు
-
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
-
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!