కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు ఎఫ్ఆర్బీఎం రూపంలో యత్నిస్తోందని, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని శాసనమండి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ప్రధాని విభజన హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలన్నారు. రాష్ట్రాలను ఆస్థిర పరిచేందుకు, బలహీన పరిచేందుకు, సంక్షేమ పథకాలు నిలిచిపోయేలా […]
తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్ట శ్రీఅంజనేయ స్వామి ఆలయం నేడు హనుమాన్ జయంతి సందర్భంగా కాషాయమయంగా మారింది. దీంతో కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు కొండగట్టు చేరుకున్నారు. దీంతో అంజన్న దర్శనానికి అర్ధరాత్రి నుంచే భక్తులు పోటెత్తారు. పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించకునేందకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. హనుమాన్ మాలదారులు కాలినడకన తరలివస్తున్నారు. అంజన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయ పరిసరాలు జై శ్రీరామ్.. […]
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇష్టంగా తాగే పానీయాలలో బ్లాక్ ముందు వరుసలో ఉంటుంది. బ్లాక్ టీ తాగడం వల్ల కలిగే 10 ప్రయోజనాలను మనం తెలుసుకుందాం. బ్లాక్‌టీ లో యాంటీఆక్సిడెంట్స్ (Antioxidants) ఉంటాయి. దీని వలన శరీర ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీంతో పాటు.. పక్షవాతం రాకుండా చేస్తుంది. అంతేకాకుండా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి బ్లాక్ టీ సహాయపడుతుంది. అధికరక్తపోటు, అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోజు బ్లాక్ టీ […]
తెలంగాణలో పర్యాటక ప్రదేశాలు రోజురోజుకు ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు రెడీ అవుతున్నాయి. అయితే.. కరీంనగర్‌లోని సందర్శకులను ఆకర్షించే మానేర్ డ్యామ్‌ను విహంగ వీక్షణం చేసేందుకు అడుగులు పడుతున్నాయి. గత రెండు రోజులుగా ప్రయోగాత్మకంగా ఎయిర్ షో నిర్వహించి.. ప్యారాచూట్ విన్యాసాలకు ఈ ప్రాంతం అనువుగా ఉందా… లేదా అని పరిశీలించిన పైలెట్ సుకుమార్ ఇప్పటికే దీనికి సమ్మతి తెలిపారు. ఈ నేపథ్యంలో.. మానేరు అందాలతో పాటు కేబుల్ బ్రిడ్జ్, కరీంనగర్ టౌన్‌ని ఆకాశం నుంచి చూసే […]
ఇటీవల రాహుల్ గాంధీ వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ రైతు రచ్చబండ పేరిట కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ పురపాలకలో కోమరబండలో కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. అయితే కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కోదాడ నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యే స్యాండ్, ల్యాండ్ మైన్ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ […]
1. నేడు కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. అయితే వేకువజాము నుంచే స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. 2. నేటి నుంచి ఈ నెల 30 వరకు సీపీఐ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో సీపీఐ ఆందోళనలు తెలుపనుంది. 3. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750లుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,090లుగా ఉంది. […]
ఎప్పుడూ కొత్త కొత్త ఆవిష్కరణలతో వినియోగదారులను తమవైపు తిప్పుకునేందుకు ఒప్పొ ముందుంటుంది. ఇప్పటికే ఒప్పొ నుంచి వచ్చిన మొబైల్స్, ట్యాబ్లెట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒప్పొ ప్యాడ్ అంటూ ఓ మోడల్‌ను విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా ఒప్పొ ప్యాడ్ ఎయిర్ పేరుతో మరొ కొత్త ట్యాబ్లెట్‌ను చైనా విపణిలోకి విడుదల చేసింది. అయితే.. త్వరలోనే ఈ ట్యాబ్ అమ్మకాలు భారత్‌లో కూడా ప్రారంభం కానున్నాయి. అయితే.. ఈ ట్యాబ్ చూడటానికి చాలా […]
ప్రధాని మోడీ ఈ నెల 26న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆప్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహించనున్న స్నాతకోత్సవ వేడుకల్లో మోడీ పాల్గొననున్నారు. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు 26 తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే.. […]
ఓ మంత్రి అక్రమాలను ప్రశ్నిస్తున్నానని తనపై నిరాధారమైన కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నాడని సమాచార హక్కు చట్టం కార్యకర్త కోయిన్ని వెంకన్న ఆరోపించారు. మంగళవారం ఆయన ఖమ్మంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్ననాని నాపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా.. రఘునాథ పాలే మండలం పువ్వాడ నగర్ గ్రామంలో 2127 ప్రభుత్వ ఇండ్ల స్థలాలను సుమారు 35 కోట్లకు […]
తెలంగాణలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలను ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే నిన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతు రచ్చబండ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కౌంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. కులాలను, మతాలను రెచ్చగొట్టే కుట్ర తెలంగాణలో జరుగుతుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. మేము ఉమ్మడి ఏపీలో మంత్రులుగా ఉన్నాము.. కానీ ఇప్పుడు […]