దేశంలో నిత్యావసరాల నుంచి మొదలు అన్నిటి ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అన్నట్లుగా తయారైంది ప్రజల పరిస్థితి. అయితే.. ఇప్పుడు మరో పెనుభారం సామాన్యుడి నడ్డి విరువనుంది. ద్రవ్యోల్బణాన్ని సాకుగా చూపుతూ వడ్డీ రేట్లను మళ్లీ పెంచడానికి ఆర్బీఐ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో సామాన్యులకు రుణాలు భారంగా మారాయి. మళ్లీ వడ్డీ రేట్లు పెంచితే మధ్య తరగతి జీవులకు గృహ, వ్యక్తిగత తదితర రుణాలు […]
నరేంద్రమోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీని బలోపేతం చేసేందుకు, సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తులు ప్రారంభించారు. అయితే.. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలను బీజేపీ శక్తికేంద్రాలుగా మార్చింది. వాటికి ఇంఛార్జీలను నియమించింది. ఆయా శక్తి కేంద్రాల ఇంఛార్జీలతో విజయవాడలో […]
ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేస్తారని విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద్‌రెడ్డి వెల్లడించారు. అయితే ముందుగా ఈ నెల 4న ఉదయం 11 గంటలకే ఫలితాలను విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల పదో తరగతి ఫలితాలను విడుదల చేయడం వీలు కాలేదు. […]
1. నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలు మార్కుల రూపంలో ప్రకటించనున్న విద్యాశాఖ. 2. ఢిల్లీలో నేడు విజ్ఞాన్ భవన్లో ఐకానిక్ వీక్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఐకానిక్ వీక్ సెలబ్రేషన్స్ జరుగనున్నాయి. 3. నేడు తెలంగాణలో టెట్ హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు. జూన్ 12న టీఎస్ టెట్ 2022 పరీక్ష జరుగనుంది. 4. అమ్నీషియా పబ్ అత్యాచారం కేసులో […]
మరోసారి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు సీఎం జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం పాపం జగనుదేనని, పోలవరం విషయంలో జగన్ జైలుకెళ్లడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా 2021 జూన్ కల్లా పోలవరం పనులు పూర్తి చేస్తామని కేంద్రానికి చెప్పేశారని, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన నిధులను నిర్వాసితులకు ఇవ్వలేదని, పోలవరానికి సంబంధించి కేంద్రం నిధులేమయ్యాయో జగన్ ప్రభుత్వం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వ్యక్తి వెదిరె […]
ఏపీలో రేపు, ఎల్లుండి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. నడ్డా పర్యటన ఏపీలో కచ్చితమైన మార్పుకు సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీజేపీ రోడ్ మ్యాప్‌ను ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతారని, 2024 ఎన్నికలకు దశాదిశా నిర్దేశం ఇస్తారని ఆయన వెల్లడించారు. ఎన్నికలకు సన్నద్దం అయ్యేలా క్యాడర్‌ను సిద్ధం చేస్తారని, నడ్డా ఏపీ కార్యక్రమం ఖరారు కాగానే జగన్ […]
నేడు పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధ్వంస పాలనలో రాష్ట్రంలో పర్యావరణానికి అపార నష్టం జరుగుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కొండలను కొట్టేస్తూ.. ఇసుకను దోచేస్తూ.. జల వనరులను మింగేస్తూ, గనులను కబళిస్తూ పర్యావరణ వినాశనానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. పర్యావరణానికి హాని కలిగిస్తోన్న ఈ ప్రభుత్వ పెద్దలపై ప్రజలు రణం చేయాల్సిందేనని ఆయన ఉద్ఘాటించారు. సహజ వనరుల దోపిడితో ప్రకృతికి ఈ […]
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రూ. 1.35 కోట్లతో అదనపు తరగతులు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ఎక్కడా లేని విధంగా స్కూల్స్ అభివృద్ధి చేస్తున్నారని ఆయన అన్నారు. మూడు విడుతల్లో అభివృద్ధి చేస్తున్నారని, వారం రోజులు పాఠశాలల్లో భోజనాలు ఏం పెట్టాలో కూడా సీఎం గారు నిర్ణయించారని […]
ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారనే అభియోగంతో టీడీపీ మహిళా నేత గౌతు శిరీషకు నిన్న సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై తాజా ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.. గౌతు శిరీష కుటుంబాన్ని అణచివేయటానికి టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా రాష్ర్టంలో రాజారెడ్డి రాజ్యంగం నడుస్తుందని, ప్రజా సమస్యలపై గొంతు విప్పాలని ప్రయత్నిస్తే అరెస్ట్ చేయాలఇ భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చారిత్రక నేపథ్యం ఉన్న కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని, బీసీ […]