Google Gift to India: మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా 'ఇండియా కీ ఉదాన్' అనే ఆన్లైన్ ప్రాజెక్టును ప్రారంభించింది.
Paytm Net Loss: జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో పేటీఎం నికర నష్టం మరింత పెరిగింది. గతేడాది 380 కోట్ల రూపాయలు నష్టం రాగా అది ఈసారి 644 కోట్లకు చేరింది. అదే సమయంలో ఆదాయం 89 శాతం పెరిగి 16 వందల 80 కోట్లుగా నమోదైంది. గతేడాది జూన్ నాటికి వచ్చిన రెవెన్యూ 891 కోట్లు మాత్రమేనని సంస్థ వెల్లడించింది. డిజిటల్ ఫైనాన్సియల్ సర్వీసుల రంగంలో పేరొందిన పేటీఎంకి ఆదాయం పెరిగినా నష్టాలు తగ్గలేదని […]
AndhraPradesh-BalKrishna: విద్యుత్ వాహనాల రంగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. రానున్న కొన్నేళ్లలో 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. లైట్ హౌజ్ స్టేట్‌గా నిలవాలని ఆకాంక్షిస్తోంది. ఈ దిశగా ఇవాళంతా కీలక సమావేశం నిర్వహిస్తోంది.
RBI interest Rates Hike: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అందరి అంచనాలనూ మించి రెపో రేటుని పెంచింది. దేశంలోని వివిధ వాణిజ్య బాంకులకు తాను ఇచ్చే లోన్లపై వసూలు చేసే వడ్డీ (రెపో) రేటును 50 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) హైక్ చేసింది. దీంతో ఇది 5.40 శాతానికి చేరింది.
RBI circular: గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో మార్పు చోటుచేసుకుంది. ఈ పథకంలో భాగంగా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బంగారాన్ని మెచ్యూరిటీ గడువు కన్నా ముందే తీసుకోవాలంటే డబ్బులు మాత్రమే చెల్లిస్తారు. గోల్డ్ ఇవ్వరు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
Digital Radio: డిజిటల్ రేడియో టెక్నాలజీని వాడితే వచ్చే ఐదేళ్లలో బ్రాడ్కాస్ట్ సెక్టార్ రెవెన్యూ రెట్టింపు కానుందని ఇవాళ విడుదలైన ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ రంగం ఆదాయం రూ.12,300 కోట్లకు వృద్ధి చెందనుందని పేర్కొంది. 'ప్రస్తుతం రేడియో స్టేషన్ల సంఖ్య 300 లోపే ఉన్నాయి.
IndiGo Revenue Soars. But: దేశంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్స్ అయిన ఇండిగో ఆదాయం రికార్డ్ స్థాయిలో 328 శాతం పెరిగింది. తద్వారా 12,855 కోట్ల రూపాయలు దాటింది. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల ఫలితాలను వెల్లడించింది.
Loans Write Off: గడచిన ఐదేళ్లలో బ్యాంకులు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల లోన్లను టెక్నికల్‌గా రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. గత నాలుగేళ్లలో 10 వేల 306 మంది ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కె.కరాడ్ రాతపూర్వకంగా తెలిపారు.
Interesting News: మనిషిని పోలిన మనిషి ఉండటం సహజం. ప్రపంచం మొత్తమ్మీద మనలాంటోళ్లు కనీసం ఆరేడుగురైనా ఉంటారట. దీనికి తాజా ఉదాహరణ.. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, తమిళ క్యారక్టర్ ఆర్టిస్ట్ మణివణ్ణన్. ఏక్నాథ్ షిండేను చూస్తుంటే ఎవరో గుర్తొస్తున్నారు.
SC Categorisation: షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మళ్లీ తెరమీదికి రాబోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో అమలైన ఏబీసీడీ వర్గీకరణ 2004లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటంతో నిలిచిపోయింది. సుప్రీంకోర్టు బ్రేక్ వేయటమే దీనికి ప్రధాన కారణం.