US Election Results: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మంగళవారం ముగియగా.. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అలాగే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం కమలా హారిస్‌పై డోనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనగసాగుతున్నారు. ట్రెండ్స్‌లో మాజీ అమెరికన్ ప్రెసిడెంట్ మెజారిటీకి చాలా దగ్గరగా వచ్చారు. భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ప్రతి ఒక్కరూ […]
Stock Markets India: వారంలో మూడవ ట్రేడింగ్ రోజైన బుధవారం నాడు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సంబంధించిన 30 షేర్ల సెన్సెక్స్ విలువ నిన్నటి రోజు ముగింపుతో పోలిస్తే.. 295 పాయింట్ల పెరుగుదలతో 79771 స్థాయి వద్ద ప్రారంభమైంది. అదే సమయంలో, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా 24308.75 స్థాయి వద్ద భారీ పెరుగుదలతో ట్రేడింగ్ ప్రారంభించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కారణంగా గ్లోబల్ మార్కెట్ బూమ్ ప్రభావం భారత మార్కెట్ పై కూడా […]
US Election Results: మొదటి నుంచి అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థులు, డెమొక్రటిక్ అభ్యర్థుల మధ్య పోటీ సమానంగానే ఉంది. ఎన్నికల ప్రచారంలో భారతీయ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులిద్దరూ చేస్తున్న ప్రయత్నాలు అమెరికా ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన ఓటర్లు ఎంత ముఖ్యమో స్పష్టం చేస్తోంది. అమెరికా రాష్ట్రం న్యూజెర్సీలో అధిక సంఖ్యలో భారతీయ ఓటర్లు నివసిస్తున్నారు. కొంతమంది దీనిని అమెరికా మినీ ఇండియాగా కూడా పరిగణిస్తారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన అత్యధిక జనాభా […]
Josh Inglis: జోష్ ఇంగ్లిస్ పాకిస్థాన్‌తో జరగనున్న టి20 సిరీస్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. పెర్త్‌లో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో వన్డే జట్టుకు కూడా నాయకత్వం వహిస్తాడు. దీనికి కారణం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించిన సన్నాహాలపై కీలక టెస్టు ఆటగాళ్లు దృష్టి సారించారు. దింతో వన్డే, టీ20లకు ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్‌ని ప్రకటించింది. వైట్ బాల్ క్రికెట్లో జోష్ ఇంగ్లిస్‌కు ఆస్ట్రేలియా బాధ్యతలు అప్పగించారు. కెప్టెన్‌గా, అతను వన్డేలో పాట్ కమిన్స్ ను, […]
America Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలు చాలా రకాలుగా విభిన్నంగా ఉంటాయి. ఓటింగ్ ప్రక్రియ వేరుగా ఉంటుంది. కానీ, అమెరికా ఎన్నికల్లో ఎక్కువగా చర్చిస్తున్న అంశం ‘బ్లూ వాల్’. మంగళవారం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలపై యావత్ ప్రపంచం దృష్టి సారిస్తోంది. ఇకపోతే, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడయ్యేందుకు సర్వశక్తులు ప్రయత్నం చేసారు. అయితే, అమెరికా రాజకీయ విశ్లేషకులు అతను అధ్యక్షుడవ్వాలనుకుంటే, అతను “బ్లూ వాల్” ను ఛేదించవలసి ఉంటుందని అంటున్నారు. […]
Nandankanan Express: ఒడిశాలోని భద్రక్‌లో నందన్కనన్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. రైలు న్యూఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్తోన్న సమయంలో ఈ ఘయ్తన జరిగింది. ఈ సంఘటన భద్రక్, బౌదాపూర్ సెక్షన్ మధ్య జరిగింది. అందిన సమాచారం ప్రకారం, రైలు నంబర్ 12816 గార్డ్ బ్రేక్ వద్ద రెండు రౌండ్ల కాల్పులు జరిగాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటన గురించి రైలు గార్డు మహేంద్ర బెహెరా మాట్లాడుతూ.. ఒక […]
Kidney Cancer Signs: ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ క్యాన్సర్ వేగంగా పెరుగుతోంది. కిడ్నీలో ఉండే అనారోగ్యకరమైన కణాలు అనియంత్రితంగా పెరగడం, కణితి రూపంలో ఉన్నప్పుడు ఈ వ్యాధి సంభవిస్తుంది. ఈ వ్యాధి ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు. కానీ ప్రజలలో పెరుగుతున్న వయస్సుతో ప్రమాదం పెరుగుతుంది. స్త్రీల కంటే పురుషులకు కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం రెండింతలు. ప్రారంభ దశలలో మూత్రపిండ క్యాన్సర్ లక్షణాలు కనపడవు. కాబట్టి అంత సులువుగా కనిపెట్టలేము. Also Read: Yogi Adityanath: ఔరంగజేబు దేశాన్ని […]
Yogi Adityanath: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోరెన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అలంగీర్ ఆలం తన సన్నిహితుడి ఇంటి నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆయనను సీఎం యోగి ‘ఔరంగజేబు’తో పోల్చారు. ఔరంగజేబు దేశాన్ని దోచుకున్నట్లే ఆలంగీర్ రాష్ట్రంలోని పేదలను దోచుకున్నాడని ఆయన అన్నారు. జార్ఖండ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి మాట్లాడుతూ.. ఔరంగజేబు […]
Green Tea Effects: గ్రీన్ టీ తాగే ట్రెండ్ ప్రస్తుతం బాగా పెరిగింది. ఫ్యాటీ లివర్ ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం గ్రీన్ టీని తయారు చేసి తాగడం చేస్తున్నారు ప్రజలు. చాలామంది గ్రీన్ టీ బరువు తగ్గడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని నమ్ముతారు. ఇది జీవక్రియ రేటును సరిచేయడం ద్వారా మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. దీన్ని రోజూ సరైన మోతాదులో తీసుకుంటే, దాని ప్రభావం వల్ల ముఖంలో కూడా మంచి రూపం […]
Uttara Pradesh Madrasa Act: ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు చట్టం 2004పై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. దీంతో యోగి ప్రభుత్వం షాక్‌కు గురైంది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. విచారణ అనంతరం సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఉత్తరప్రదేశ్ లోని మదర్సా చట్టంపై మంగళవారం (నవంబర్ 5)న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం […]