ఫోన్ ట్యాపింగ్ కేసులో మేజర్ డెవలప్మెంట్ జరగబోతుంది.. ఈ కేసులో సుప్రీంకోర్టుని సిట్ ఆశ్రయించబోతుంది.. నాలుగు సార్లు ప్రభాకర్ రావు విచారించిన తమకు సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు సిట్ చెప్పబోతుంది.. ప్రభాకర్ రావుకు ఉన్న రిలీఫ్ ని వెంటనే రద్దుచేసి కస్టోడియల్ ఎంక్వయిరీకి అనుమతి ఇవ్వాలని సుప్రీంను సిట్ కోరే అవకాశం ఉంది.. ఇందుకు సంబంధించి పావులను సిట్ కరూపుతుంది.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఇప్పుడు సెల్ ఫోన్ చుట్టూనే తిరుగుతుంది.. కేటీఆర్ సెల్‌ఫోనే ఏసీబీ అధికారులకు కీలకంగా మారింది.. సెల్‌ఫోను ఇచ్చేది లేదని కేటీఆర్ ఏసీబీకి కరాకండిగా తేల్చి చెప్పారు.. గతంలో వాడిన సెల్ ఫోను ఇప్పుడు తన దగ్గర లేదని, ఇప్పుడు కొత్త ఫోన్ వాడుతున్నానని చెప్పారు.. ఇందుకు సంబంధించి లిఖిత పుర్వకంగా ఏసీబీ అధికారులకు కేటీఆర్ సమాధానం పంపాడు.. అయితే సెల్‌ఫోన్ ఇవ్వకపోతే తదుపరి చర్యలకు తాము సిద్ధమని ఏసీబీ అధికారులు అంటున్నారు.. ఎలాంటి చర్యలు తీసుకుంటారనీ ఏసీబీ…
దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు ఒక మంచి పేరుంది.. మావోయిస్టు కట్టడి చేయడంలో తెలంగాణ పోలీస్ లకు మించి ఎవరు చేయలేరని చెప్తారు.. మావోయిస్టుపై ఆపరేషన్ చేయడం ఎన్కౌంటర్ చేయడం మావోయిస్టులో కీలక సమాచారాన్ని బయటకి తీసుకురావడంలో తెలంగాణ పోలీస్ లకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ..అయితే ఇవన్నీ చేయడానికి మావోయిస్టుల లోపటికి వెళ్లి వాళ్ళ సమాచారం తెలుసుకోవడమే కాకుండా వాళ్ళ ఫోన్లను వాళ్లకు సహాయాలు చేసేవారి ఎప్పటికప్పుడు ట్యాప్ చేసి ఆమెరకు మావోయిస్టులపై తెలంగాణ పోలీస్ లు పైచేయి అయ్యింది..
ఈరోజు పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన సిట్ అధికారులు... రేపు బీజేపీ కీలక నేతల స్టేట్మెంట్ తీసుకోనున్నారు. ఎంపీలు ఈటెల, ధర్మపురి, రఘునందన్ రావులకు సిట్ నుంచి పిలుపు వచ్చింది. ఈ ముగ్గురి ఫోన్లతోపాటు... వీళ్ల అనుచరులు, కుటుంబ సభ్యులు, ఎన్నికల సమయంలో వీరికి ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ల ఫోన్లు సైతం ట్యాపింగ్ గురైనట్లు ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు.
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టుల పేరు చెప్పి ఫోన్ టాపింగ్ కి ప్రభాకర్ రావు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. సాధారణ ఎన్నికల సమయంలో 600 మంది మావోయిస్టులకు సహాయం చేస్తున్నారని చెప్పి 600 ఫోన్ లను రివ్యూ కమిటీకి ఇచ్చి టాపిక్కు పాల్పడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచింది సిట్. నాకేం తెలీదని ప్రభాకర్ రావు అంటుంటే… ప్రభాకర్ రావు చెప్పిందే తాను చేశానని ప్రణీత్ రావు అంటున్నాడు !! దీంతో… ఇద్దరినీ కలిపి వాచారించాలని భావిస్తున్నారు సిట్ అధికారులు. అలా ఐతే కానీ.. అసలు బండారం బయటపడేలా లేదు. ఫోన్ ట్యాపింగ్ నిందితులంతా ప్రభాకర్ రావు పేరు చెప్తుంటే… ప్రభాకర్ రావు మాత్రం తెలీదు… గుర్తులేదు.. మరిచిపోయా… అంటూ సిట్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడట ! ఫోన్ […]
జైలులోనే డ్రగ్స్ దందాకు స్కెచ్ వేశారు. యస్.. మీరు విన్నది కరెక్టే. ఇద్దరు నైజీరియన్లు.. ముగ్గురు ఇండియన్స్ కలిసి డ్రగ్స్ దందాకు ప్లాన్ చేశారు. అంతే కాదు..జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ ప్లాన్ అమలు చేశారు. కొన్నాళ్లు బాగానే నడిచినా.. మళ్లీ అందరినీ కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. డ్రగ్స్ పేరు చెబితే అందులో కచ్చితంగా నైజీరియన్స్ పాత్ర.హైదరాబాద్‌లో డ్రగ్స్ పేరు చెబితే అందులో కచ్చితంగా నైజీరియన్స్ పాత్ర ఉంటుంది. జైలులో ఒక్కటైన బిషప్, రోనాల్డ్ […]
కొత్తగా ఏదైనా నేరం జరిగితే… ముందుగా పాత నేరస్తుల డేటాను పోలీసులు పరిశీలిస్తారు. దాదాపు చాలా కేసుల్లో ఇదే ఆనవాయితీ ఉంటుంది. అంటే పాత నేరస్తుల క్రైమ్ తీరు.. వారి మోటో ఆధారంగా కేసులు ఛేదిస్తారు. అలాగే కొన్ని కేసుల్లో ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కూడా క్రిమినల్స్‌ను పట్టుకుంటారు. ఇప్పుడు అందుకోసం కొత్త టెక్నాలజీ అందుబాటులోకి తెస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఆ టెక్నాలజీ ఏంటి? ఎలా పని చేస్తుందో చూద్దాం.నేరాలు చేసేవారు ఇక తప్పించుకోలేరు. వరుసగా నేరాలు […]
హైదరాబాద్‌లో డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి? అని ఎవరైనా అడిగితే పబ్స్‌లో దొరుకుతాయని ఈజీగా సమాధానం చెప్పవచ్చు. అంతలా డ్రగ్స్ దందా అక్కడ నడుస్తోంది. ఏకంగా కొంత మంది డీజేలే పెడ్లర్ల అవతారం ఎత్తి వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా పబ్బులు.హైదరాబాద్‌లో పబ్బులు.. డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి.. పబ్బుల తీరు మారడం లేదనే విమర్శలు. ఒక్కసారి రెండుసార్లు కాదు.. పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసినా.. డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. అంతే కాదు డ్రగ్స్ […]
కుటుంబ కలహాలకు పిల్లలు బలవుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు విపరీతంగా జరుగుతున్నాయి. సొంత తల్లి లేదా తండ్రి వారి ఉసురు తీసే స్థాయికి దిగజారుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇద్దరు చిన్నారులను తండ్రి కర్కశంగా కడతేర్చాడు. అనంతరం సూసైడ్ చేసుకుంటున్నా అని లెటర్ రాసి పెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు అతడి మిస్సింగ్ కూడా ఇంకా మిస్టరీగానే ఉంది. కలహాల కాపురానికి చిన్నారులు బలి.కలహాల కాపురానికి చిన్నారులు బలి.. ఇద్దరి గొడవల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.భార్య, భర్త […]