Bengaluru Cafe Blast : బెంగళూరు కేఫ్‌లో పేలుడు నిందితుడి ఫోటోలు ఇటీవల బయటకు వచ్చాయి. ఆ ఫోటోల్లో నిందితుడు టోపీ పెట్టుకుని బస్సులో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది.
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. ‘అభివృద్ధి చెందిన భారత్, అభివృద్ధి చెందిన జమ్మూ కాశ్మీర్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన బక్షి స్టేడియానికి చేరుకున్నారు. వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రపాలిత ప్రాంతానికి ప్రధానమంత్రి సుమారు రూ. 5,000 కోట్ల బహుమతిని ఇవ్వనున్నారు.
Supreme Court : సుప్రీంకోర్టులో ఓ ఆసక్తికర కేసు విచారణకు వచ్చింది. దానిపై ఇప్పుడు కోర్టు నిర్ణయం వెలువడింది. ఆంధ్రప్రదేశ్ చట్టం ప్రకారం 'నెయ్యి'ని పశువుల ఉత్పత్తిగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 1994లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీం కోర్టు సమర్థించింది.
TikTok Ban in US: 2020లో చైనాతో సంబంధాలు క్షీణించిన తర్వాత, చైనా యాప్ టిక్-టాక్‌ను భారత్ నిషేధించింది. ఇప్పుడు అమెరికాలో కూడా ఈ యాప్‌ను బ్యాన్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
Arvind kejriwal : మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చిక్కులు పెరిగే అవకాశం ఉంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు గురువారం అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 16న హాజరు కావాలని ఆదేశించింది.
Bomb Alert : ఆకాసా ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు ఇచ్చిన బెంగళూరుకు చెందిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిజానికి ఆ వ్యక్తి భార్య ఎయిర్‌పోర్టుకు చేరుకోవడం ఆలస్యమవడంతో ఫ్లైట్ ఆలస్యంగా వెళ్లేందుకని ఇలా చేశాడు.
Kerala : వీధి కుక్కల కంటే మనిషి ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేరళ హైకోర్టు పేర్కొంది. కేరళ హైకోర్టు ఈ వ్యాఖ్యను టీఎం ఇర్షాద్ వర్సెస్ కేరళ ప్రభుత్వం విషయంలో పేర్కొంది.
Congress : లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ తొలి జాబితా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం ఈరోజు సాయంత్రం 6 గంటలకు జరగనుంది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలో ఓ వ్యక్తి బహిరంగంగా చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది చూసిన తర్వాత స్థానికంగా కలకలం రేగింది.
BJP : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ కోర్ గ్రూప్ రాష్ట్రాల సమావేశం జరిగింది. దాదాపు 6 గంటల పాటు ఈ సమావేశం నడిచింది. బిజెపి రెండవ జాబితా 150 సీట్లపై చర్చ జరిగింది.