Nalgonda : నల్గొండ జిల్లా దేవరకొండ గురుకుల హాస్టల్‌లో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేవరకొండలోని కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో రెండు రోజుల క్రితం జరిగింది.
Jharkhand : ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ 2023ని జార్ఖండ్ స్టేట్ స్టాఫ్ కమిషన్ రాష్ట్రంలో నిర్వహిస్తోంది. 583 పోస్టులకు నిర్వహిస్తున్న ఈ పరీక్షలో ఇప్పటివరకు 10 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షకు హాజరై మరణించారు.
Maharastra : ఆగస్టు 26న మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లోని మాల్వాన్‌లో ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం ఒక్కసారిగా కుప్పకూలింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Pakistan : పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఒక విమాన ప్రయాణీకుడికి మంకీ పాక్స్ (ఎంపాక్స్) వైరస్ నిర్ధారణ అయిన తరువాత, దేశంలో 'ఎంపాక్స్' కేసుల సంఖ్య ఐదుకు పెరిగింది
Bangladesh : ఒకవైపు దేశంలో నిరసనలు వెల్లువెత్తుతుండగా, బంగ్లాదేశ్ కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు వరదల కారణంగా దేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. వర్షం విపత్తులా కురుస్తోంది.
America : అమెరికాలోని మిస్సిస్సిప్పిలో ఇంటర్‌స్టేట్ రూట్ 20లో శనివారం ఉదయం బస్సు బోల్తా పడడంతో ఏడుగురు మరణించగా, 37 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా,
Tamilnadu : తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా నజరేత్ సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీ గోదాములో శనివారం సాయంత్రం జరిగిన పేలుడులో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, ఇద్దరు మహిళలు సహా నలుగురు గాయపడ్డారు.
LPG Cylinder Prices : చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) శనివారం 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించాయి. సవరించిన ధరల ప్రకారం నేటి నుంచి రూ.39 పెరిగింది.