LPG Cylinder Prices : వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Cylinder Prices : చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) శనివారం 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించాయి. సవరించిన ధరల ప్రకారం నేటి నుంచి రూ.39 పెరిగింది. పెంపుతో ఇప్పుడు ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ రూ.1691.50కి అందుబాటులోకి రానుంది. అయితే 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో చమురు కంపెనీలు ఎలాంటి మార్పు చేయకపోవడం కొంత ఊరటనిచ్చే అంశం. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల పెంపు తర్వాత కొత్త రేట్లు కూడా వెలువడ్డాయి.
ఢిల్లీలో ధర రూ.39 పెరిగింది
కొత్త రేట్ల ప్రకారం నేటి నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.39 పెరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1691.50కి చేరింది.
Also Read
- UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
- CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
- Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
- OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
Read Also:Off The Record : ఆ ఎమ్మెల్యే సొంత హామీలు..గెలిచి 9 నెలలు గడిచినా..!
ముంబై-కోల్‌కతాలో ధర ఎంత?
ఇండియన్ ఆయిల్ కంపెనీ (IOCL) వెబ్సైట్ ప్రకారం.. వాణిజ్య LPG సిలిండర్ల ధరల పెరుగుదల సెప్టెంబర్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. ఆ తర్వాత ముంబైలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1644కి చేరింది. గతంలో ముంబైలో వాణిజ్య సిలిండర్ ధర 1605 రూపాయలు. కోల్‌కతాలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1764.50 నుంచి రూ.1802.50కి పెరిగింది. చెన్నైలో ఈ సిలిండర్ ఇప్పుడు రూ. 1855కి అందుబాటులో ఉంటుంది. ఇంతకుముందు దీని ధర రూ.1817. హైదరాబాద్ మహానగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1935 రూపాయలుగా నమోదు అయింది.
ఆగస్టులో కూడా పెరుగుదల
అంతకుముందు ఆగస్టులో కూడా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచారు. ఆ సమయంలో 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ ధర రూ. 8.50 పెరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1652.50కి పెరిగింది.
Read Also:Off The Record : తెలంగాణ బీజేపీకి కొత్త అస్త్రం.? అందుకే రేవంత్ రెడ్డిని టార్గెట్.?
జూలైలో తగ్గిన ధరలు
అయితే, రెండు నెలల క్రితం జూలై 1వ తేదీన చమురు కంపెనీలు ఎల్పిజి ధరలను తగ్గించాయి. దీంతో ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.30 తగ్గింది. ఆ సమయంలో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర 1646 రూపాయలుగా ఉంది. కోల్‌కతాలో రూ.1756, చెన్నైలో రూ.1809.50, ముంబైలో రూ.1598గా మారింది.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు లేదు
కొన్ని నెలలుగా ఆయిల్ కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయడం లేదు. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.803గా ఉంది. అయితే ఉజ్వల లబ్ధిదారులకు మాత్రం రూ.603కే ఇది లభిస్తుంది. ముంబయిలో ఈ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.802.50; చెన్నైలో రూ.818.50; హైదరాబాద్‌లో రూ.855; విశాఖపట్నంలో రూ.812గా ధర ఉంది.
తాజావార్తలు
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?