Lokesh Kanagaraj : ఇదేందయ్యా లోకేషూ.. ఇంకెప్పుడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కూలీ’ తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా ఏంటంటే పెద్ద లిస్టే ఉంది. కానీ, వీటిలో ఒక్క సినిమాను డైరెక్ట్ చేయకుండా బన్నీతో సినిమా ప్రకటించాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో తీయాల్సిన సీక్వెల్స్ చాలా ఉన్నాయి. లోకేష్ ను స్టార్ ని చేసిన ‘ఖైదీ’ సీక్వెల్ చాలా సంవత్సరాలుగా ఊరిస్తోంది. కమల్ హాసన్‌తో తీయాల్సిన ‘విక్రమ్ 2’ బ్యాలెన్స్ ఉంది. ఇక లైన్లో ‘లియో 2’ ఉన్నా.. విజయ్ యాక్టింగ్‌కి గుడ్ బై చెప్పేశాడు. ఇన్ని సీక్వెల్స్ లైన్లో ఉన్నా, ఎప్పటికప్పుడు సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా కొత్త క్యారెక్టర్స్ సృష్టిస్తున్నాడు లోకేష్. లోకేష్ ఎప్పటికప్పుడు ఇంతవరకు వర్క్ చేయని హీరోలను వెతుక్కుంటాడే గానీ, కమిట్ అయిన సినిమాల జోలికి పోవడం లేదు. ‘విక్రమ్’ మూవీలో సూర్య పోషించిన ‘రోలెక్స్’ రోల్ సినిమాకు కిక్ ఎక్కించింది; దీంతో సూర్యతో ‘రోలెక్స్’ టైటిల్‌తో సినిమా ఉంటుందన్నాడు. ఇవన్నీ అటకెక్కేస్తూ అమీర్ ఖాన్‌తో సినిమా కమిట్ అయ్యాడు లోకేష్. ‘కూలీ’ ప్రమోషన్లో మాట్లాడుతూ.. ఇండియన్ ఆడియన్స్‌కే కాదు, వరల్డ్ వైడ్ సినీ లవర్స్‌కు నచ్చేలా అమీర్ ఖాన్‌తో యాక్షన్ మూవీ తీస్తానన్నాడు.
లోకేష్ కన్ఫ్యూజన్ నుంచి రజినీకాంత్ ఒక్కడే ఊపిరి పీల్చుకున్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా కథలు రాసుకొని పార్ట్-2లతో ఊరించే ఈ దర్శకుడు, ‘కూలీ’ సినిమాను ఒక పార్ట్‌గానే తీశాడు. పార్ట్-2కు ఛాన్స్ లేకుండా కథ రాసుకోవడంతో, లోకేష్ కోసం రజినీకాంత్ ఎదురుచూసే పని లేకుండా పోయింది. లేదంటే సూపర్ స్టార్‌కు కూడా ఎదురుచూపులు తప్పేవి కావు. ‘కూలీ’ ఫ్లాప్ తర్వాత, ది గ్రేట్ సినిమాటిక్ (DGC) సినిమాలో హీరోగా నటిస్తున్న లోకేష్ కనగరాజ్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా కొత్త సినిమా ‘బెంజ్’కు కథ అందిస్తున్నాడు. ఇందులో లారెన్స్ హీరోగా నటిస్తూ ఉండగా, జయం రవి కూడా జాయిన్ అయ్యాడు. షూటింగ్‌కి సంబంధించిన ఫోటోస్‌ని పంచుకున్నాడు లోకేష్.
Also Read
- Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
- Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
- Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
- Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
లోకేష్ కనగరాజ్ కోసం జయం రవి మనసు మార్చుకున్నాడు. భార్యతో విడాకులు వచ్చే వరకు నటించనని ప్రకటించిన జయం రవి, ‘బెంజ్’ కు డేట్స్ ఇవ్వడం షాక్ ఇస్తోంది. మీడియా ముందు తన బాధను గట్టిగా వెళ్లగక్కి రెండు వారాలు తిరక్కుండానే ‘బెంజ్’ మూవీ అప్డేట్ రావడంతో తంబీలు షాక్ అయ్యారు. జయం రవి ఆవేశంలో, కోపంతో డివోర్స్ వచ్చే వరకు నటించనని చెప్పారు. కానీ, ప్రాణం ఉన్నంత కాలం నటిస్తామని యాక్టర్స్ చెబుతూ ఉంటారు; ఇందుకు జయం రవి మినహాయింపు ఏమీ కాదు. ఎంతకాలం ఖాళీగా ఇంట్లో కూర్చుంటాడు, కెమెరా ముందుకు వచ్చేసాడంటూ జయం రవి అభిమానులు సమర్థిస్తున్నారు. ‘బెంజ్’ లో మలయాళ స్టార్ నివిన్ పౌలీ విలన్ గా నటిస్తున్నాడు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో ‘బెంజ్’ రూపొందుతోంది. ఒక సినిమాలోని పాత్రలను మరో సినిమాలోని క్యారెక్టర్స్‌తో లింక్ చేసి, సినిమాటిక్ యూనివర్స్‌తో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు లోకేష్. మరి బన్నీ సినిమా కూడా ఇదే కోవలోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఖైదీ, విక్రమ్, లియో, బెంజ్‌లోని పాత్రలను ఏ సినిమాతో లింక్ చేస్తాడో చూడాలి మరి!
తాజావార్తలు
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
-
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
-
Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!