Tirumala laddu controversy: తిరుమల లడ్డూ వివాదంలో ప్రస్తుత ప్రభుత్వం నా మీద విష ప్రచారం చేస్తోంది అని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలుగుతోందని సుప్రీం కోర్టులో నేను పిటీషన్ దాఖలు చేశాను.. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పరిస్థితులు ఉన్నాయి.. 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయ్యారయ్యాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. అధిక ధరలతో నెయ్యిని కొనుగోలు చేశారన్న ఆరోపణలు నిజం కాదు.. 2019 -2024 హయాంలోనే కల్తీ జరిగిందని దర్యాప్తు చేస్తున్నారు.. అంతకు ముందు కూడా కల్తీ జరిగిందా..!? దర్యాప్తు జరగాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
Read Also: Mahindra XEV 9s: భారత మార్కెట్లోకి మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ SUV XEV 9S.. ధర ఎంతంటే..?
అయితే, మా హయాంలో రూ.80 కోట్ల రూపాయలతో అత్యాధునిక సదుపాయాలతో “టెస్ట్ లాబ్” ఏర్పాటు చేశామని మాజీ టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. 2019కి ముందు భక్తులు ఇచ్చిన దానాలు, టీటీడీ నిధులను సుమారు 1200 కోట్ల రూపాయలను ప్రైవేట్ “ఎస్” బ్లాంకులో డిపాజిట్ చేశారు.. మా హయాంలో ఆ నిధులను “విత్ డ్రా” చేసి ప్రభుత్వ బ్యాంకులో డిపాజిట్ చేశాం.. తద్వారా సుమారు 100 కోట్ల రూపాయలను “సేవ్” చేశామన్నారు. మేము విత్ డ్రా చేసిన తర్వాత, ఎస్ బ్యాంక్ దివాలా తీసింది.. మా హయాంలో కిలో నెయ్యిని 320 రూపాయలకు కొనుగోలు చేశాం కాబట్టి కల్తీ జరిగిందని అంటున్నారు..ఆ ఆరోపణలే నిజమైతే, అంతకు ముందు చంద్రబాబు హయాంలో కూడా అంతకంటే తక్కువ ధరకే నెయ్యిని కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఇక, 2019కి ముందు కూడా కిలో నెయ్యిని 279, 295 రూపాయలకు కూడా కొనుగోలు చేశారని పేర్కొన్నారు. కాబట్టి, అప్పడు కూడా నెయ్యి కల్తీ జరిగిందని అనుకోవాలా..? అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.
