YV Subba Reddy: బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఉభయ సభల్లో రాష్టానికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రస్తావించాలని దృష్టి సారించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. గతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 57 వేల కోట్ల అంచనాతో కేంద్రానికి నివేదిక పంపాం.. టీడీపీ నేతృత్వంలో “ఎన్డీయే” కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజక్ట్ ఎత్తును 41.5 మీటర్లకు తగ్గించింది.. అలాగే, పోలవరం నిధులు కుదించారు.. ఎత్తు తగ్గించడం వలన నీటి నిల్వ సామర్ధ్యం తగ్గి, రాష్ట్రం నష్టపోతుంది అని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్ర, సృజల స్రవంతికి నీరు అందించాలి.. దానిపై మా పోరాటం కొనసాగుతుంది.. విశాఖ రైల్వే జోన్ ఐదు ఏళ్లలో పూర్తి చేయాలని అప్పుడు కోరాం.. రైల్వే జోన్ పనులు ప్రారంభించే కార్యక్రమం జరుగుతుంది.. వాల్తేరు డివిజన్ స్ప్లిట్ చేసి ఒరిస్సాకు ఇచ్చారు అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Read Also: MP Horror: 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేసిన బంధువులు..
ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు నాలుగు ఐదు నెలల నుంచి జీతాలు రావడం లేదు అని వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విశాఖ స్టీల్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేలా పోరాటం చేస్తాం.. విశాఖ స్టీల్ కు “కాప్టివ్ మైన్స్” పై రెండు సభల్లో ఒత్తిడి తీసుకొస్తాం.. స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజీ ఇచ్చినా ఉద్యోగులలోఆందోళన ఉంది.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీలు సభలో మా నాయకుడు జగన్ పై, పార్టీ ఎంపీలపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు.. రాష్టానికి రావాల్సిన ప్రాజెక్టులకు మా వంతుగా పూర్తి సహకారం అందిస్తాం.. కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర అంశాలను వివరిస్తాం.. అలాగే, రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు లభించక ఇబ్బందులు పడుతున్నారు.. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిర్చి పంట కొనే పరిస్థితి లేదని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.