ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపికే.. అధికార పార్టీ నేతలో.. ప్రతిపక్ష నేతలో.. ఈ విషయంపై తరచూ స్పందిస్తూ ఉంటారు.. విశాఖ నుంచి పాలన కొనసాగించాలని అధికార వైసీపీ వేగంగా ప్రయత్నాలు చేసినా.. కొన్ని అనివార్య కారణాలతో అది వాయిదా పడింది.. ఇక, ఈ మధ్య మళ్లీ తరచూ విశాఖ రాజధానిపై మాట్లాడుతూనే అధికార వైసీపీ నేతలు.. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం ఖాయమని మరోసారి స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధాని రావడం ఖాయమని తాము పదేపదే చెబుతున్నామన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని త్వరలోనే వస్తుందని.. దానిపై సంకేతాలు అందుతున్నాయన్న వైసీపీ ఎంపీ.. తేదీ ఎప్పుడు అనేది తామే చెబుతామన్నారు. మరోవైపు.. ఆస్తి పన్ను వ్యవహారంలో ఏపీలో కాకరేపుతుండగా.. ఆ అంశంపై స్పందించిన ఆయన.. 15 శాతం కన్నా ఎక్కువగా టాక్స్ పెరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు.
త్వరలో విశాఖకు క్యాపిటల్.. సంకేతాలు అందుతున్నాయి..!
Show comments