వారం రోజుల్లోనే ఎంపీ రఘురామకు నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశామని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రఘురామపై 290 పేజీల డాక్యుమెంట్‌ను స్పీకర్‌కు అందజేశామన్నారు. వారం రోజుల్లోనే రఘురామకు నోటీసులు వస్తాయని భావిస్తున్నామని తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున చర్యగా ఫిర్యాదు చేశామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా గుర్తుపై విజయం సాధించిన రఘురామకృష్ణంరాజు పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనేది స్పష్టంగా సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఇందుకు సంబంధించి సుమారు 290 పేజీలతో కూడిన డాక్యుమెంట్‌ను తమ పార్టీ పక్షాన స్పీకర్‌కు అందించామన్నారు. తాము ఇచ్చిన సాక్ష్యాలను ఆధారంగా చేసుకుని స్పీకర్ ఆయనకు మరో వారం రోజుల్లోపే నోటీసు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. స్పీకర్‌కు ఉన్న విచక్షణ అధికారాలతో వేటు వేస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
- RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
తాజావార్తలు
-
Tamil Nadu: హమ్మయ్య.. ఉత్కంఠకు తెర.. విజయ్‌కు వీసీకే మద్దతు
-
Ragi Sweet Bondalu : రుచికి తోడు ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి బోండాలు.. పిల్లలు మళ్లీ మళ్లీ అడుగుతారు.!
-
Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
-
UP: రేపే యోగి కేబినెట్ విస్తరణ.. ఎన్నికల వేళ కొత్త ముఖాలకు ఛాన్స్!
-
Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..