తెలంగాణ మంత్రి వ్యాఖ్యలకు రోజా కౌంటర్

RK Roja

RK Roja

తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం మరింత ముదిరి మాటల యుద్ధానికి తెరలేచింది.. తాజాగా, తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె.. ఒక మంత్రి అయిఉండి ముఖ్యమంత్రిని గజదొంగ అని వ్యాఖ్యానించటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు.. ఏపీకి కేటాయించిన నీళ్లు కాకుండా అదనంగా చుక్క నీళ్లు కూడా వాడుకోవటం లేదనే విషయం తెలంగాణ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తెలుసుకోవాలని.. ప్రజల మనుసుల్లో విషం చిమ్మే ప్రయత్నం చేయటం మంచిదికాదని హితవుపలికారు.. మరోవైపు సీతానగరం ఘటనపై స్పందించిన ఆమె.. ఆ ఘటన దురదృష్టకరం అన్నారు.. టీడీపీ హయాంలో ఎంతో మంది అమ్మాయిలపై అత్యాచార ఘటనలు జరిగాయన్న వైసీపీ ఎమ్మెల్యే.. రాజకీయ ఒత్తిడిలతో ఒక్కరికి కూడా శిక్ష వేసే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు.. ఒక ఘటనతో టీడీపీ నేతలు విమర్శలకు దిగటం విడ్డూరం అన్నారు రోజా.. రితికేష్వరి, వనజాక్షి ఘటనలపై అప్పుడు చంద్రబాబు, టీడీపీ మహిళా నాయకులు ఏం చేశారు? అంటూ ఫైర్‌ అయ్యారు. కాగా, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌పై మంత్రి ప్రశాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీటిని తరలించి, ఆనాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నీటి దొంగ అయ్యాడని.. ఇవాళ వారి కొడుకైనా మారాడనుకుంటే లంకలో ఉన్నవాళ్లంతా రాక్షసులే అన్నట్టుగా.. సీఎం వైఎస్‌ జగన్‌ దొంగతనంగా ప్రాజెక్టులు కడుతున్నారని.. రాయలసీమ ప్రాజెక్ట్, ఆర్డీఎస్‌ రైట్‌ కెనాల్‌ కట్టి జగన్‌ గజదొంగ అయ్యారంటూ హాట్‌ కామెంట్‌ చేయడం వివాదాస్పదమైంది.