గజపతినగరంలో నల్లకండువాలతో జనాగ్రహ దీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు చేసిన కామెంట్లు ఎంతటి దుమారం కలిగించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీడీపీ నేతలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జనాగ్రహ దీక్షలు అంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నాలుగు రోడ్లు కూడలి వద్ద నల్లకండువాల తో వైఎస్సార్ పార్టీ జనాగ్రహ దీక్ష చేపట్టారు.
రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ నాయకుల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గజపతినగరంలో నాయకులు పెద్ద ఎత్తున జనాగ్రహ దీక్ష చేపట్టారు . ఈ జనాగ్రహ దీక్షలో స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య . నియోజకవర్గ స్థాయి , మండల స్థాయి నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .
Also Read
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
ఈ సందర్భంగా గజపతినగరం ఎమ్మెల్యే అప్పలనరసయ్య టీడీపీపై నిప్పులు చెరిగారు. 2019 ఎన్నికలలో చంద్రబాబు ఓటమిని జీర్ణించుకోలేక రాష్ట్రంలో అల్లర్లు సృష్టస్తున్నారన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకూ ప్రతి ఎన్నికల్లో ప్రజలు జగన్‌కి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ని తెలుగు దేశం పార్టీ కి చెందిన వారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు , ఇతర టీడీపీ నేతలు భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!