ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు చేసిన కామెంట్లు ఎంతటి దుమారం కలిగించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీడీపీ నేతలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జనాగ్రహ దీక్షలు అంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నాలుగు రోడ్లు కూడలి వద్ద నల్లకండువాల తో వైఎస్సార్ పార్టీ జనాగ్రహ దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ నాయకుల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గజపతినగరంలో నాయకులు పెద్ద ఎత్తున జనాగ్రహ దీక్ష చేపట్టారు .…