నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహార శైలిపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. తన ఫోను ఇంటలిజెన్స్ అధికారులు టైపింగ్ చేస్తున్నారని శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలు కలకలం రేపాయి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న తనపై అర్థం కావడం లేదని అన్నారు ఫోన్ టైపింగ్ చేస్తున్నారని సమాచారం అందువల్లే ఇతర ఫోన్లు ద్వారా రహస్యాలు మాట్లాడుకుంటున్నానని కూడా ఆయన స్పష్టం చేశారు శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలు వైసిపి అధిష్టానం లో కలకలం రేపాయి. మీడియాలో వచ్చిన వార్తలను విశ్లేషించిన పార్టీ అధిష్టానం ఈ వ్యవహారంపై జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా మంత్రి తాకానికి గోవర్ధన్ రెడ్డిలతో మాట్లాడినట్లు తెలిసింది.
Read Also: Hyderabad Traffic Alert : హైదరాబాద్‌లో నేటి నుంచి 40 రోజులు ఆ రూట్కు వెళ్లకండి
శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యం.. అందుకు దారి తీసిన పరిణామాలు.. తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించినట్లు సమాచారం.. ముఖ్యమంత్రి జగన్ వినుకొండ పర్యటన నుంచి వచ్చిన అనంతరం ఆయనతో శ్రీధర్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ నేతలు చర్చిస్తారని తెలుస్తోంది. గత కొద్ది కాలంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నా.. ఆర్థిక శాఖ నిధులను విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతోందని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ పై కూడా ఆయన ఆరోపణలు చేశారు.
అనంతరం ముఖ్యమంత్రి జగన్… శ్రీధర్ రెడ్డిని తాడేపల్లికి పిలిపించుకుని చర్చించారు.దీంతో సమస్య ముగిసిందని అందరూ భావించినా తన ఫోన్ ను ఇంటెలిజెన్స్ అధికారులు టాప్ చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.. దీంతో అధిష్టానం శ్రీధర్ రెడ్డి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని చర్చిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్లు వైసీపీలో కాకరేపుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ పనితీరుపై నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై పార్టీ ఎలా స్నందిస్తుందనేదిr చర్చనీయాంశంగా మారింది.
Read Also: Hyderabad Traffic Alert : హైదరాబాద్‌లో నేటి నుంచి 40 రోజులు ఆ రూట్కు వెళ్లకండి