Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Tdp National President Election Today In Tdp Mahanadu 2025

TDP Mahanadu 2025: నేడే టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక.. నామినేషన్లు వేసేది ఎవరు..?

Published Date :May 28, 2025 , 9:10 am
By Sudhakar Ravula
  • మహానాడులో ఈ రోజు కీలక ఘట్టం..
  • టీడీపీ జాతీయ అధ్యక్ష పదవికి నేడు నామినేషన్లు దాఖలు..
  • మధ్యాహ్నం జాతీయ అధ్యక్షుడు ఎన్నిక..
  • సాయంత్రం నూతనంగా ఎన్నికైన జాతీయ అధ్యక్షుని చేత ప్రమాణ స్వీకారం..
TDP Mahanadu 2025: నేడే టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక.. నామినేషన్లు వేసేది ఎవరు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

TDP Mahanadu 2025: తొలిరోజు అట్టహాసంగా ప్రారంభం అయ్యింది టీడీపీ మహానాడు.. తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారి కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్నారు. తిరుమల తొలిగడప, దేవుని కడపలో జరుగుతున్న మహానాడు చరిత్ర సృష్టిస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక, మహానాడు ఈ రోజు కీలక ఘట్టానికి వేదిక కానుంది.. టీడీపీ జాతీయ అధ్యక్ష పదవికి నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.. ఆ తర్వాత మధ్యాహ్నం జాతీయ అధ్యక్షుడు ఎన్నిక జరగనుంది.. సాయంత్రం నూతనంగా ఎన్నికైన జాతీయ అధ్యక్షుని చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది.. పోటీ లేనందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునే నేడు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది.. అయితే, గత కొంత కాలంగా పార్టీలోనూ మంత్రి నారా లోకేష్‌కి కీలక బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ సాగుతూ వస్తోంది.. దీంతో, లోకేష్‌కి ఏం బాధ్యతలు ఇస్తారు? అనేది ఆసక్తికరంగా ఆమారింది.. ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు లోకేష్.. ఇప్పుడు మరింత కీలకమైన పదవి కట్టబెడతారని తెలుస్తుండగా..? అది ఏ పదవి అనేది చర్చగా మారింది..

Read Also: Kubera : నాగార్జునపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ధనుష్ ..

కాగా, ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు గాను ఏడు స్థానాలు కూటమికి కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపడం కోసమే కడపలో మహానాడు నిర్వహిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం విదితమే.. సార్వత్రిక ఎన్నికల్లో 57 శాతం ఓట్ షేరింగ్ సాధించినట్లు సీఎం వివరించారు. కార్యకర్తల పట్టుదల, శ్రమ వల్లే నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ల పనే అయిపోయింది. ఇక, పేదలకు కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం అన్నారు నారా లోకేశ్‌. భవిష్యత్తు కోసం ఆరు శాసనాలను ప్రతిపాదించారు. తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవల్లో సోషల్‌ రీఇంజినీరింగ్‌, అన్నదాతకు అండగా, కార్యకర్తలే అధినేత. అనే ఆరు శాసనాలను సభ ముందుంచారు లోకేష్‌. ఉమ్మడి కడప జిల్లా వైసీపీకి పెట్టని కోట.. అయితే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారిగా పది స్థానాలకు గాను ఏడు స్థానాలను దక్కించుకుంది కూటమి… దీంతో జోష్ లో ఉన్న టీడీపీ కడపలో మహానాడు నిర్వహిస్తోంది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cm chandrababu
  • Nara Lokesh
  • tdp mahanadu
  • TDP Mahanadu 2025

తాజావార్తలు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions