TDP Mahanadu: తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారి కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్నారు. 3 రోజులపాటు జరగనున్న మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. సభా వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మా తెలుగుతల్లికి గీతాలాపన చేశారు. మృతి చెందిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సంతాపం తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయినవారికి సంతాపం ప్రకటించారు. భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. తిరుమల తొలిగడప, దేవుని కడపలో జరుగుతున్న మహానాడు చరిత్ర సృష్టిస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు గాను ఏడు స్థానాలు కూటమికి కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపడం కోసమే కడపలో మహానాడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో 57% ఓట్ షేరింగ్ సాధించినట్లు సీఎం వివరించారు. కార్యకర్తల పట్టుదల, శ్రమ వల్లే నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ల పనే అయిపోయింది.
Read Also: UPSC Aspirant Suicide: వైఫల్యాల ఒత్తిడి.. ఆత్మహత్య చేసుకున్న సివిల్స్ అభ్యర్థి..
43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలను ఎదుర్కొన్నాం. పాలనంటే హత్యా రాజకీయాలు, కక్షసాధింపులుగా గత ప్రభుత్వం మార్చేసింది. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని వైసీపీ సర్వ నాశనం చేసింది. దీన్ని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలు, నాయకుల ప్రాణాలు తీశారు. చంద్రయ్యను పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు. ఆయనే మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తే పార్టీని నడిపిస్తుందని చంద్రబాబు చెప్పారు. ఏడాదిలో మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ పథకం అందిస్తామన్నారు చంద్రబాబు. కేంద్రం ఇచ్చే 6 వేలతో కలుపుకొని మూడు విడతల్లో 20 వేలు చెల్లిస్తామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు..
Read Also: Pakistan: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ ప్లేస్కి ఎగబాకిన పాక్ ప్లేయర్
పేదలకు కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం అన్నారు నారా లోకేశ్. భవిష్యత్తు కోసం ఆరు శాసనాలను ప్రతిపాదించారు. తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవల్లో సోషల్ రీఇంజినీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్తలే అధినేత. అనే ఆరు శాసనాలను సభ ముందుంచారు లోకేష్. వెనుకబడిన కార్యకర్తల ఆర్థిక స్థితి గతులను మార్చడానికి ఇక నుంచి పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఉరసా సంస్థకు 99 పైసలకు ఎకరా భూమి ఇచ్చినట్టు జగన్ నిరూపిస్తే.. రాజీనామాకు సిద్ధమని లోకేశ్ సవాల్ చేశారు. ఇవాళ, రేపు కూడా మహానాడులో ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నారు. వేల సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. మహానాడు ప్రాంగణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మహానాడుకు వచ్చినవారికి 30 రకాల వంటకాలతో పసందైన భోజనం వడ్డించారు. ఈ నెల 29న భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు.
