టీడీపీ తన బలాన్ని బీజేపీకి బదలాయించింది: సజ్జల
బద్వేల్ ఉప ఎన్నికలో అధికార పార్టీ వైసీపీ ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బద్వేల్ ఉప ఎన్నికలో చారిత్రక విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఎన్నిక తమ బాధ్యతను మరింత పెంచుతోందని సజ్జల వ్యాఖ్యానించారు. ఓడితే సమీక్షించుకోవడానికి, గెలిస్తే మరింత బాధ్యతగా పనిచేయడానికి స్ఫూర్తిని ఇస్తుందని సజ్జల తెలిపారు.
Read Also: సీఎం జగన్ రికార్డును బద్దలు కొట్టిన మహిళ
Also Read
మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై సజ్జల విమర్శలు చేశారు. బద్వేల్ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయకపోయినా బీజేపీ అభ్యర్థిని తమ భుజాలపై మోసిందని ఆరోపించారు. జనసేన కూడా ఇదే రకంగా పనిచేసిందన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బద్వేల్లో బీజేపీకి 800లోపే ఓట్లు వచ్చాయని, కానీ ఇప్పుడు బీజేపీకి 20వేల ఓట్లు రావడంతో టీడీపీ తన బలమంతా బీజేపీకి బదలాయించిందని సజ్జల విమర్శలు చేశారు. తెరచాటున టీడీపీ, బీజేపీ కలిసి పనిచేశాయని అర్థమవుతోందని సజ్జల వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
-
Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
-
Summer Holidays: విద్యార్థులకు శుభవార్త.. రేపటి నుంచే వేసవి సెలవులు.. ఎప్పటివరకంటే..
-
USA: డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..
-
IPL 2026: ‘మీరు మారిపోయారు సార్’.. లక్నో ఓడినా పంత్‌ను హత్తుకున్న ఓనర్ సంజీవ్ గోయెంకా..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!