TDP Mahanadu 2025: రెండు గంటల్లో టీడీపీకి రూ.17 కోట్ల విరాళాలు.. ఏం చేస్తారంటే..?
- టీడీపీపై విరాళాల వర్షం ..
- కేవలం 2 గంటల వ్యవధిలోనే రూ.17 కోట్లకు పైగా విరాళాలు..
- పార్టీ కోసమే కాకుండా, పేదలు, పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు చేస్తాం..
- మహానాడు వేదికగా ప్రకటించిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Mahanadu 2025: మహానాడు వేదికగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టీడీపీపై విరాళాల వర్షం కురిసింది.. కేవలం రెండు గంటల వ్యవధిలోనే 17 కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్టు టీడీపీ ప్రకటించింది.. పార్టీ తరపున సేకరించిన విరాళాలు పార్టీ కోసమే కాకుండా, పేదలు, పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని వెల్లడించారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Read Also: BJP MP Laxman: రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని ఖర్గే కలలు కంటున్నారు..
Also Read
టీడీపీకి విరాళాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు పిలుపునివ్వగా.. రెండు గంటల వ్యవధిలేనే భారీగా విరాళాలు ఇచ్చారు టీడీపీ నేతలు, కార్యకర్తలు.. పార్టీలో డబ్బున్న నేతలు కార్యకర్తల సంక్షేమానికి విరాళాలు ఇవ్వాలి కోరారు సీఎం చంద్రబాబు.. అయితే, పార్టీ బ్యాంకు ఖాతాను ప్రకటించిన వెంటనే 17 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయని ప్రకటించారు.. పార్టీకి విరాళాలు ఇచ్చిన దాతలు అందరికీ అభినందనలు.. ఆన్‌లైన్‌లో కూడా పార్టీకి విరాళాలు అందించవచ్చు.. అన్నారు చంద్రబాబు.. మహానాడు ఎప్పుడు నిర్వహించినా హుండీ ఏర్పాటు చేసి.. సేకరించిన విరాళాలు పేదల కోసం ఖర్చు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.. మహానాడు తొలిరోజు ప్రకటన చేయగానే స్పందించి రూ.17 కోట్లకు పైగా విరాళాలు అందించిన టీడీపీ నేతలు, అభిమానులు అందరికీ అభినందనలు తెలియజేశారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, కడప వేదికగా పసుపు పండుగ మహానాడు అట్టహాసంగా సాగుతోంది.. ఇవాళ ప్రారంభమైన మహానాడు.. మరో రెండు రోజుల పాటు కొనసాగనున్న విషయం విదితమే..
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్‌బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్‌ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
-
Story Board : పెట్రోల్ భారం.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఆర్థిక వ్యవస్థ ఎటు వైపు?
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!