Pulivendula Election Results: 43 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. పులివెందులలో ఎగిరిన టీడీపీ జెండా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pulivendula Election Results: మున్సిపల్ ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సత్తా చాటింది. జిల్లాలోని మున్సిపాలిటీల్లో కూటమి ఆధిపత్యం ప్రదర్శించగా, వైసీపీ ఎక్కడా చెప్పుకోదగ్గ ఆధిక్యత కనబరచలేకపోయింది. నామినేషన్ల ప్రక్రియలోనే ఆరు మున్సిపాలిటీలను కూటమి కైవసం చేసుకోగా, జమ్మలమడుగు, పులివెందుల మున్సిపాలిటీల్లో టీడీపీ ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా పులివెందుల మున్సిపాలిటీలో టీడీపీ విజయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 43 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఇప్పటివరకు పులివెందులలో ఆ పార్టీ గెలుపొందలేదు. తొలిసారిగా కూటమి విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు..
పులివెందుల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీకి చెందిన తూగుట్ల గీతా కుమారి 13,898 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీల ఓటమి పాలయ్యారు. దీంతో ‘వై నాట్ పులివెందుల’ నినాదం కూటమి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపినట్టు అయ్యింది.. అయితే, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతినిథ్యం వహిస్తోన్న పులివెందులలో వైసీపీ ఓటమి చెందడంతో ఆ పార్టీకి షాక్ తగిలినట్టు అయ్యింది..
Also Read
- Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
- YS Jagan: ‘మా టైమ్ వస్తుంది.. వడ్డీతో సహా చెల్లిస్తాం’.. జగన్ 2.0లో వేరే లెవల్ ఉంటుంది..!
- Pulivendula Tension: పులివెందులలో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ అభ్యర్థుల ఇళ్ల వద్ద వాహనాల దహనం
- Kadapa: ప్రొద్దుటూరులో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఇంటిపై దాడి!
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Pulivendula Election Results: 43 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. పులివెందులలో ఎగిరిన టీడీపీ జెండా..
-
Hyderabad: రూ.6.78 కోట్ల నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్..
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Air India: పాక్ ఆంక్షల కారణంగా ఎయిర్ ఇండియాకు నష్టం..
-
Pitapuram Municipal Results: పిఠాపురంలో సత్తా చాటిన రెబల్స్.. ఏకంగా 7 వార్డుల్లో విజయం..!
ట్రెండింగ్
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!