NTV Telugu Site icon

Police Notice: వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు పోలీసుల నోటీసులు..

Police Notice

Police Notice

Police Notice: కడప జిల్లా పులివెందులలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పీఏ రాఘవరెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఇళ్లకు ఈ మేరకు నోటీసులు అంటించారు పోలీసులు.. పలు కేసులలో రాఘవ రెడ్డి, వివేక్ రెడ్డి, అర్జున్ రెడ్డి అనుమనితులుగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.. అయితే, విచారణకు సహకరించాలని నోటీసులలో పేర్కొన్నారు పోలీసులు. అయితే, ఏపీలో ఇష్టం వచ్చినట్టుగా నేతలను టార్గెట్‌ చేస్తూ.. పోస్టులు పెడుతున్న వ్యవహారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మరోవైపు.. ఉద్దేశ్యపూర్వకంగానే తమ పార్టీ నేతలు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్‌ చేసింది.. తప్పుడు కేసులు బనాయించి భయపెడుతున్నారని.. అరెస్ట్‌లు చేస్తున్నారని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ నేతుల మండిపడుతున్నారు. మరోవైపు.. కడప కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ పీఏ రాఘవరెడ్డి.. అయితే, రాఘవరెడ్డి పిటిషన్‍పై విచారణ సోమవారానికి వాయిదా వేసింది కోర్టు.. కాగా, గత కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి.. పీఏ రాఘవరెడ్డి.

Read Also: Fire Accident: పుప్పాల్ గూడ లో భారీ అగ్ని ప్రమాదం.. అపార్ట్‌మెంట్ నిర్వాహకులపై పోలీసులు సీరియస్..

Show comments