Peddireddy Ramachandra Reddy: పార్టీ కోసం శ్రమించిన వారికే కీలక పదవులు
- పార్టీ కోసం శ్రమించిన వారికే కీలక పదవులు..
- స్పష్టం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..
- ఎన్నికల అనంతరం వైసీపీ బలోపేతం పై దృష్టి సారించాం..
- జిల్లా.. మండల స్థాయిలో పార్టీ కార్యవర్గాన్ని సిద్ధం చేస్తున్నాం..
- నియోజకవర్గ సమన్వయకర్తలతో చర్చించి పార్టీ పోస్టుల్లో నియామకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy Ramachandra Reddy: పార్టీ కోసం శ్రమించిన వారికే కీలక పదవులు వస్తాయని స్పష్టం చేశారు వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. కడపలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోసమావేశమయ్యారు రెండు జిల్లాల ముఖ్య నాయకులు.. పార్టీ బలోపేతంపై చర్చించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం పై దృష్టి సారించాం.. జిల్లా, మండల స్థాయిలో పార్టీ కార్యవర్గాన్ని సిద్ధం చేస్తున్నాం.. నియోజకవర్గ సమన్వయకర్తలతో చర్చించి పార్టీ పోస్టుల్లో నియామకాలు చేస్తున్నాం.. పార్టీలో అవసరమైన మార్పులు చేర్పులు జగన్ దృష్టికి తీసుకుని వెళ్తాం.. పార్టీ కోసం శ్రమించిన వారికే కీలక పదవులు వస్తాయని తెలిపారు.
Also Read
ఇక, రాష్ట్రంలో ప్రభుత్వం పరిస్థితి దారుణంగా ఉందన్నారు పెద్దిరెడ్డి.. వైఎస్ జగన్ హయంలో ఏపీఈఆర్సీ సమావేశం అనగానే కరెంట్ బిల్లులు పెంపు అని మీడియాలో రాసేవారు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 6 వేల కోట్లు కరెంట్ చార్జీలు పెంచడానికి రంగం సిద్దం చేశారు.. కరెంట్ చార్జీల పెంపు గత ప్రభుత్వంలో జగన్ తప్పుల వలన అని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. బోట్లు కొట్టుకుని బ్యారిజీకి ఇబ్బంది ఏర్పడితే… అదీ మా పార్టీపై నింద మోపే ప్రయత్నం చేస్తున్నారు.. మేం రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులను ఆదుకుంటే… నేడు క్రాప్ ఇన్స్యూరెన్స్ కూడా రైతులే కట్టుకోవాలని నిర్ణయించారని విమర్శించారు.. రైతు ఆత్మహత్యలు రోగం కారణంగా జరిగాయి అని గతంలో టిడిపి ప్రభుత్వం లో నాగం జనార్ధన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడారు.. అలాంటి వారికి ఏమైనా రైతులు పట్ల బాధ్యత ఉంటుందా? అని ప్రశ్నించారు. మరోవైపు.. చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ ను షర్మిల చదువుతున్నారు.. కేసులో ఉన్న ఆస్తులు బదలాయింపు సాధారణంగా జరగదు.. జగన్ బెయిల్ రద్దు చేయించే కుట్రలకు షర్మిల తెర తీశారు.. చంద్రబాబు పన్నాగం ప్రకారం షర్మిల నడుస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..
తాజావార్తలు
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!